నాగబాబు సీటు సానాకు, చక్రం తిప్పిందెవరు - డామేజ్ కంట్రోల్..!!

ఏపీలో రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభకు కూటమి నుంచి ముగ్గురు అభ్యర్ధులు ఖరారయ్యారు. ఈ ఎంపిక పై కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాగబాబుకు ఖాయం అని భావించిన సీటు సానా సతీశ్ కు దక్కింది. ఈ ఎపిసోడ్ లో ముఖ్య నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీంతో, నష్ట నివారణ కోసం నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నాగబాబు కంటే సానా సతీశ్ కు ఎందుకు అంత ప్రాధాన్యత అనే ఆసక్తి కర చర్చ మొదలైంది.

ఎంపిక వెనుక
మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కలేదు. అనకాపల్లి ఎంపీ సీటు చివరి దాకా వచ్చి దక్క లేదు. ఇప్పుడు రాజ్యసభ ఖాయం అని భావించినా చివరి నిమిషంలో మిస్ అయింది. నాగబాబు కు రాజ్యసభ కోసం పవన్ ప్రయత్నించారు. కానీ, అప్పటికే జరిగిన ఒప్పందాలు - ఒత్తిళ్లు పవన్ ప్రయత్నాల పైన ప్రభావం చూపాయి. దీంతో, నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని నిర్ణ యం తీసుకున్నారు. పవన్ ను బుజ్జగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే, నాగబాబు కంటే సానా సతీశ్ ను రాజ్యసభకు ఎంపిక చేయటం వెనుక ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

Sana Satish name finalised for Rajyasabha why the Nagababu name missed in final list

నాగబాబు స్థానంలో
నాగబాబు కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో జనసేన లో కీలకంగా వ్యవహరించారు. జనసేన పార్టీ శ్రేణులు.. మెగా ఫ్యాన్స్ కలిసి కట్టుగా కూటమికి పని చేసేలా ముందుకు నడిపించారు. కూట మి అధికారంలోకి వస్తే నాగబాబుకు కీలక ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అయితే, ఇప్పుడు రాజ్యసభ సీటు సాధించిన సానా సతీశ్ సైతం రాజకీయాల్లో ఉన్న వారికి సుపరిచితుడు. నాడు వైఎస్ హయాంలో వాన్ పిక్ వ్యవహారంలోనూ సానా సతీశ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. గత ఎన్నిక ల్లో కాకినాడ ఎంపీ స్థానం కూటమి నుంచి ఆశించారు. ఆ సీటు జనసేనకు కేటాయించారు. కొంత కాలం విద్యుత్ శాఖలో పని చేసిన సానా సతీశ్ ఆ తరువాత ప్రముఖుల పరిచయాలతో అనూహ్యం గా ఎదిగారు. పలు వివాదాస్పద అంశాల్లో సానా సతీశ్ పేరు తెర మీదకు వచ్చింది.

సానాకు ప్రాధాన్యత
సతీశ్ పేరు పలు ఈడీ కేసుల్లో చాలా సార్లు వినిపించింది. గత ఎన్నికల్లో సీటు దక్కకపోయినా టీడీపీకి ఆర్దికంగా అండగా నిలిచారనే ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ, జనసేన ముఖ్య నేతల పేర్లతో సతీశ్ వ్యవహారాల పైన పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సతీష్ కు రాజ్యసభ కోసం కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అయితే, నాగబాబు ను రాజ్యసభకు పంపటం ద్వారా పెద్దల సభలో తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించిన జనసేన శ్రేణులకు తాజా నిర్ణయం రుచించటం లేదు. దీంతో, జనసేన లో వస్తున్న స్పందనతో నాగబాబును మంత్రిగా తీసుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+