రాజకీయాలపై రజినీకాంత్ కు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ షాకింగ్ హెచ్చరిక!!

సూపర్ స్టార్ రజినీకాంత్ 73 సంవత్సరాల వయసులో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 2023 లో విడుదలైన జైలర్ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ను మరింత పెంచింది. నిన్న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా, ఓటిటీ జి5 ఒక ఆసక్తికర వీడియోని పంచుకోవడంతో ప్రస్తుతం దానిపై చర్చ జరుగుతుంది.

తలైవా రజినీకాంత్ కు రాజకీయాలలోకి రావద్దని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వద్దని ఎర్రచందనం స్మగ్లర్ కూసే మునిస్వామి వీరప్పన్ వార్నింగ్ ఇచ్చిన వీడియోను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓటిటీ జి5 పంచుకోవడం, వీరప్పన్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? రాజకీయాల మీద వీరప్పన్ అభిప్రాయం ఏమిటి? ఆయన రజినీకాంత్ కు చెప్పిన అంశాలు ఏమిటి? అన్నది ఆసక్తిగా మారింది.

Sandalwood smuggler Veerappan shocking warning to Rajinikanth on politics!!

త్వరలో కూసే మునిస్వామి వీరప్పన్ పేరుతో ఓటిటీ జి5లో ఓ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. అందులో వీరప్పన్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలతో స్పందించినట్టు గా తెలుస్తుంది. రజినీకాంత్ ను ఉద్దేశించి వీరప్పన్ మొసళ్ళు నిన్ను మింగడానికి వేచి ఉన్నాయని హెచ్చరించారు. రజినీకాంత్ ను దోచుకోవడానికి, మింగేసేందుకు రాజకీయాలలో మొసళ్ళు వేచి ఉన్నాయని కూసే మునిస్వామి వీరప్పన్ చెప్పడం ప్రధానంగా కనిపిస్తుంది.

రాజకీయాలలో ఎంజీఆర్ చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రజల కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రజల కోసం కష్టపడ్డారని ఎంజీఆర్ లాంటివారు పుట్టడం కష్టమని వీరప్పన్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇదే సమయంలో రజినీకాంత్ కూడా ఆయనలా అవుతారని తనకు బాగా తెలుసని పేర్కొన్న వీరప్పన్ రజినీకాంత్ అందరి పట్ల గౌరవంగా ఉంటారు అని వ్యాఖ్యలు చేశారు.

కానీ ఒక్క విషయం అయ్యా.. రజినీకాంత్.. నేను నీతో మాట్లాడుతున్నా.. రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికి మద్దతు తెలపవద్దు. నిన్ను మింగడానికి ఎన్నో మొసళ్ళు వేచి చూస్తున్నాయి. అవి ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయచేసి అమాయకుడిలా బలి కావద్దు అంటూ వీరప్పన్ మాట్లాడిన దృశ్యాలను ఓటిటీ జి5 షేర్ చేసింది.

1996 సంవత్సరంలో తమిళనాడు ఎన్నికలకు ముందు జయలలితకు వ్యతిరేకంగా రజినీకాంత్ మాట్లాడారని, ఫలితంగా జయలలిత అధికారాన్ని కోల్పోయారని, అది ప్రత్యర్ధి పార్టీ డీఎంకేకు లాభించిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ గురించి వీరప్పన్ మాట్లాడి ఉంటాడని సమాచారం. ఆ తర్వాత రజినీ ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం కానీ, ఏ రాజకీయ పార్టీ పక్షం తీసుకోవడం కానీ చెయ్యలేదు. అభిమానుల ఒత్తిడితో రాజకీయ పార్టీ పెట్టాలని తలచినా, అనారోగ్య సమస్యలతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయలేకపోతున్నానని ప్రకటించి పక్కకి తప్పుకున్నారు రజినీకాంత్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+