వైద్య విద్యార్థులకు పండుగే.. వారికి ఏడాదికి రూ.1,50000 స్కాలర్ షిప్!

వైద్య విద్య చాలా ఖరీదైనది. అటువంటి వైద్య విద్యను అభ్యసించాలి అంటే ఎంతో ప్రతిభ మాత్రమే కాదు దానికి తగ్గట్టు ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు కొనుగోలుకు, హాస్టల్ లో ఉండేందుకు అయ్యే ఖర్చు కోసం లక్షల రూపాయల డబ్బు కూడా ఉండాలి. పేద వైద్య విద్యార్థులు ఎంతో కష్టపడి ఉచితంగా సీటు సాధించినప్పటికీ, వైద్య విద్యను అభ్యసించడానికి పడరాని పాట్లు పడుతున్నారు.

ఫీనిక్స్ ఫౌండేషన్ మెడికల్స్ స్కాలర్షిప్ .. ఎన్టీఆర్ వర్సిటీతో ఒప్పందం

పుస్తకాలు కొనుగోలు చేయాలన్నా , లేదా ఇతరత్రా ఖర్చులకోసం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ప్రతిభ ఉన్న పేద వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీనిక్స్ ఫౌండేషన్ మెడికల్స్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తో ఈ మేరకు ఫీనిక్స్ ఫౌండేషన్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

scholarships to medical students in ap Phoenix Foundation to offer medical scholarships to talented poor MBBS students worth 1 5lakhs

మంత్రి సత్యకుమార్ సమక్షంలో అవగాహనా ఒప్పందం

మంత్రి సత్య కుమార్ సమక్షంలో ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్, మరియు ఫీనిక్స్ ఫౌండేషన్ నిర్వాహకులు చుక్కపల్లి సురేష్ ఈ మేరకు ఒప్పంద పత్రాల పైన సంతకాలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దివంగత చుక్కపల్లి శంకర్రావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.

స్కాలర్ షిప్ ప్లాన్ ఇలా

ఈ స్కాలర్షిప్ కింద 2026- 27 విద్యా సంవత్సరంలో మొదటి దశలో పదిమంది ఎంబిబిఎస్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి సంవత్సరానికి కనీసం ఒకటిన్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆ తర్వాత సంవత్సరాలలో సంఖ్యను క్రమంగా పెంచుతూ 2027- 28 సంవత్సరంలో 20 మందికి, 2028-29 సంవత్సరంలో 30 మందికి, 2030-31 సంవత్సరంలో 50 మందికి సహాయం అందిస్తారు.

ఒక్కో విద్యార్థికి కనీసం 1.50 వేల రూపాయల ఆర్థిక సహాయం

ఆ తర్వాత 2031- 32 నుంచి ప్రతి సంవత్సరం 50 మంది విద్యార్థులను ఎంపిక చేసిన స్కాలర్షిప్ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు వైద్య కోర్సు పూర్తయ్యే వరకు ట్యూషన్ ఫీజు లో పూర్తిస్థాయి సహాయం అందిస్తారు. అంటే 100% ట్యూషన్ ఫీజు వారే చెల్లిస్తారు. అవసరమైన వారికి హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తారు. ఒక్కో విద్యార్థికి కనీసం ఒక లక్ష 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు.

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై బిగ్ న్యూస్!
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై బిగ్ న్యూస్!

రాష్ట్రంలో ఎంపిక చేసిన వైద్య కళాశాలలలో అమలు

ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఎంపిక చేసిన వైద్య కళాశాలలలో అమలవుతుంది. పేద కుటుంబాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి ఆర్థిక భారం లేకుండా అవకాశం కల్పించడమే ఇస్ స్కాలర్షిప్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ విధంగా సహాయం చేయడం వల్ల అనేక మంది పేద వైద్య విద్యార్థులు చదువు పైన పూర్తిస్థాయిలో ఫోకస్ చేసి గొప్ప డాక్టర్లుగా తయారయ్యే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+