స్కూల్ బస్ కి నిప్పంటించిన దుండగులు
గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలోఓ పాఠశాల బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి తగులబెట్టారు.
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలోఓ పాఠశాల బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి తగులబెట్టారు. స్థానిక గురజాల పట్టణం లో ఆక్స్ఫర్డ్ పాఠశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి పట్టణం లో ఉన్న పాఠశాల కు పిల్లలను చేరవేసేందుకు నాలుగు బస్సులు దైద గ్రామంలో ఓ ప్రాంతం లో రాత్రికి పార్కింగ్ చేసుకుంటారు.
ఉదయాన్నే విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాల కి చేరుస్తారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు ఝామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్ ని పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ పాఠశాల కు చెందిన మూడు బస్సులు మరో ప్రక్క పెట్టి ఉన్నాయి. వాటికి ఏమీ కాలేదు.

కానీ ఈ బసు మాత్రం మిగిలిన మూడు బసు లకు సంబంధం లేకుండా పెట్టాడు డ్రైవర్. తెల్లవారుఝామున బసు లోనుండి దట్టంగా మంటలు పొగలు రావటం చూసిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బస్ మొత్తం తగులబడింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications