విశాఖ బదులు ఇక ఆ విమానాలన్నీ భోగాపురానికే - ముహూర్తం ఫిక్స్..!!
ఏపీకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. భోగాపురం విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసారు. ప్రధాని మోదీ ఈ విమానాశ్రయం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. తమ సంస్థ విమాన సర్వీసులు ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కాకుండా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి నడుస్తాయని తన ట్రావెల్ ఏజెంట్లకు లేఖ రాసింది. దీంతో.. ఇక భోగాపురం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ఏపీలలో భోగాపురం విమానాశ్రయం నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూలై 8వ తేదీన విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయంటూ సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. తమ సంస్థ విమాన సర్వీసులు ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కాకుండా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి నడుస్తాయని తన ట్రావెల్ ఏజెంట్లకు లేఖ రాసింది. దాని ప్రకారం జూలై 5న విమానాశ్రయం ప్రారంభం అవుతుందని, 8 నుంచి విమానాలు నడుస్తాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూలై 5/8/10వ తేదీల్లో ఏదో ఒకరోజు ప్రారంభించాలని, వాటిలో ఒక తేదీని ఖరారు చేస్తే ఏర్పాట్లు చేసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటన నేపథ్యంలో జూలై 5న విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జూలై 8న ప్రారంభానికి సన్నాహాలు
స్కూట్ ఎయిర్‌లైన్స్ సింగపూర్-విశాఖపట్నం మధ్య గతంలో వారానికి నాలుగు రోజులు విమాన సర్వీసులు నడిపేది. ఇప్పుడు డిమాండ్ తగ్గిందని మూడు రోజులే(సోమ, బుధ, శుక్రవారం) నడుపుతోంది. సింగపూర్ నుంచి రాత్రి 11 గంటలకు వచ్చి తిరిగి 11.15 గంటలకు బయలుదేరి వెళ్తోంది. విశాఖ విమానాశ్రయం కోడ్ వీటీజెడ్ కాగా భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కోడ్ కూడా వీటీజెడ్‌గానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదే విధంగా టెర్మినల్-1లో స్కూట్ ఎయిర్‌లైన్స్ చెక్ ఇన్ కౌంటర్ విమానం బయలుదేరడానికి 2.30 గంటల ముందు తెరుస్తారని, అక్కడ ప్రయాణికులు వివరాలు సమర్పించాలని సూచించింది. విశాఖ నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న భోగాపురం విమానాశ్రయంలో 120 నిమిషాల ముందు ఉండాలని స్పష్టంచేసింది. దీంతో.. ఇప్పుడు భోగాపురం నుంచి ఇతర సంస్థల సర్వీసుల పైనా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications