ఈ రాత్రికే నగరానికి బాబు, కైలాసగిరిపై సోలార్ టవర్
హైదరాబాద్: ఐదు రోజుల తన చైనా పర్యటనను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శనివారం నాడు లేక్ వ్యూలో పార్టీ నాయకులతో చంద్రబాబు సమావేశం అవనున్నారు.
ఈ సమావేశంలో చైనాలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన బాబు పర్యటన విశేషాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా చైనాలో పర్యటించిన బాబు అక్కడి పారిశ్రామికి వేత్తలతో సమావేశాలు నిర్విహంచి, పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

కైలాసగిరిపై సోలార్ టవర్: మంత్రి గంటా
త్వరలో నిర్మించనున్న పర్యాటక భవన్ కోసం విశాఖపట్నం జిల్లాలో స్ధలాన్ని సేకరిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కైలాస్‌గిరిపై సోలార్ టవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి సంబంధించిన అనుమతుల కోసం వుడా వీసీ ఇన్‌చార్జ్‌గా సింగిల్‌విండో డెస్క్‌ను ప్రారంభించనట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రా కాశ్మీర్‌గా పిలుచుకునే లంబసింగిలో 500 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్, క్రూయిజ్, వాటర్ స్పోర్ట్స్, డాల్ఫిన్స్ అక్వేరియంను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక అల్లూరి సీతారామరాజు స్వస్ధలంలో ఆయనకి సంబంధించిన
స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications