బిజెపి - టిడిపి పొత్తులపై వీడని ఉత్కంఠ, కెసిఆర్‌పై డౌట్

ఆ రెండు పార్టీల మధ్య చర్చలేవీ జరగలేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్, తెరాస మధ్య పొత్తు వ్యవహారం తేలే వరకూ వేచి చూడాలని టిడిపి నేతలు భావిస్తున్నారట. కాంగ్రెస్‌తో పొత్తు లేదంటూ కెసిఆర్ పదేపదే ప్రకటనలు చేస్తున్నా టిడిపిలో ఎక్కువమంది నేతలు దానిని విశ్వసించడం లేదట.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలు అసంతృప్తికి లోనుకాకుండా ఉండకుండా చూసుకోవడం కోసమే ఆయన ఒంటరిగా పోటీ అంటూ పదే పదే ప్రకటిస్తున్నారని టిటిడిపి నేతలు అనుమానిస్తున్నారు. ఆ రెండు పార్టీల మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుందని టిడిపి భావిస్తోంది.
తెరాస ప్రభావం ఉత్తర తెలంగాణకే పరిమితమని, దక్షిణ తెలంగాణలో ఆ రెండు పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే బలంగా ఉందని, రెండూ కలవడం వాటికి తప్పనిసరి లెక్కలు వేస్తున్నారు. ఆ మాట ఇప్పుడే చెబితే రెండు పార్టీల్లో టికెట్లపై ఆశలు పెట్టుకొన్న అనేక మంది నేతలు ఇతర పార్టీల్లోకి దూకడానికి సిద్ధమవుతారని, ఈ పరిణామం స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం చేస్తోందని, అందుకే పొత్తు లేదని కెసిఆర్ చెబుతున్నారంటున్నారు.
అయితే, ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే వాటి నుంచి కొందరు గట్టి నేతలు తమ వైపు వస్తారని టిడిపి నేతలు భావిస్తున్నారు. వారిలో కొందరితో టిడిపి నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారట. తమవైపు ఎవరు వస్తారో చూసుకొని ఆ తర్వాత బిజెపితో పొత్తులపై దృష్టిపెట్టడం మంచిదని భావిస్తున్నారు. మరోవైపు, బిజెపి - టిడిపిల మధ్య పలు సీట్ల షేరింగ్ అయిపోయిందని కొందరు, పంపకంలో గందరగోళం నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడిందనే వారు లేకపోలేదు.












Click it and Unblock the Notifications