సచివాలయం ఉద్యోగులకు షాక్, ఆరోపణలు ఉంటే కుదరదని చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగులు పరిస్థితి తారుమారు అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు వెంట తిరిగిన వేలాది మంది వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయడం కోసం వారి ఉద్యోగాలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం కూలిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్లు వారు అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది. ప్రస్తుతం వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగులు బదిలీల కోసం ప్రయత్నాలుు చేస్తున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు ఓ కొలిక్కి వస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వారి బదిలీల కోసం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని చంద్రబాబు ప్రభుత్వం సచివాలయం ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత శాఖలకు సంబంధించి ఖాళీల ఆధారంగా సచివాలయాల ఉద్యోగుల బదిలీ జరుగుతుందని చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు పదివేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 612 సచివాలయాలు ఉంటే 4,940 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో 691 సచివాలయాలు ఉంటే 5,562 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీల కోసం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్, సీనియారిటీ ఆధారంగా బదిలీలు జరుగుతాయని చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నెలాఖరులోపు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుందని సంబంధిత సీనియర్ అధికారి అంటున్నారు.
గతంలో విజిలెన్స్, ఏసీబీ సంస్థల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు బదిలీలు కావాలని వారు కోరుకున్నా వారికి బదిలీలు అయ్యే అవకాశం లేదని తెలిసింది. సచివాలయాల ఉద్యోగులు వారి సొంత ప్రాంతాల్లో పని చేయడానికి వీలులేదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పని చేస్తున్న సుమారు పదివేల మంది ఉద్యోగులు వారికి కావాల్సిన ప్రాంతాలకు బదిలీ కావడానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.












Click it and Unblock the Notifications