వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయం ఖాళీ, నవ్వుకుంటూ వాళ్లు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విభజన నేపథ్యంలో రాష్ట్ర సచివాయం బోసిబోయి కనిపించింది. బుధవారంనాడు సచివాలయంలో ఉద్యోగులు కనిపించలేదు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. చాలామంది ఉద్యోగులు కూడా ఢిల్లీ బాట పట్టినట్లు కనిపిస్తోంది.

తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలతో హోరెత్తే సచివాలయం బుధవారం కాస్తా నిశబ్దంగానే కనిపించింది. సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీ బాట పట్టారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందడిగా మారింది. ఢిల్లీలో ధర్నా చేయడానికి సీమాంధ్ర ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. తొలుత కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలవడానికి వారు నిర్ణయించుకున్నారు.

సీమాంధ్ర ఉద్యోగులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వారు ఢిల్లీలో తమ వాదనలను వినిపించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నాలుక కోసినా, కాళ్లు విరగ్గొట్టినా తాము సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాగిస్తామని ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్ బ్యానర్

సేవ్ ఆంధ్రప్రదేశ్ బ్యానర్

ఢిల్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీకి బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ బ్యానర్లతో ఇలా...

27న ఢిల్లీలో ధర్నా..

27న ఢిల్లీలో ధర్నా..

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి సీమాంధ్ర ఉద్యోగులు ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతూ కనిపించారు.

కలిసుంటేనే మంచిది..

కలిసుంటేనే మంచిది..

విడిపోతే పడిపోతాం, కలిసుంటే అభివృద్ధి చెందుతామంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ప్లకార్డులను ప్రదర్శించారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం..

సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం..

సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డుతో సీమాంధ్ర సచివాలయ ఫోరానికి చెందిన ప్రతినిది ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కనిపించాడు.

తరలిపోదాం...

తరలిపోదాం...

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేసి, విభజనపై కాంగ్రెసు అధిష్టానం మనసు మార్చడానికి సచివాలయ ఉద్యోగులు ఇలా డిల్లీకి బయలుదేరారు.

రైలు ఎక్కిన తర్వాత కూడా..

రైలు ఎక్కిన తర్వాత కూడా..

తమ సమైక్యాంధ్ర నినాదాలతో, ప్లకార్డులతో సీమాంధ్ర ఉద్యోగులు రైలు ఎక్కారు. వారు ఢిల్లీలో తమ వాదనను వినిపించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరారు.

జెసితో గంటా నవ్వుతూ..

జెసితో గంటా నవ్వుతూ..

కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో సీమాంధ్ర మంత్రి గంటా శ్రనివాస రావు, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి విభజన వేడిలోనూ ఇలా నవ్వుతూ...

మీడియాతో సీరియస్‌గా..

మీడియాతో సీరియస్‌గా..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్ సీరియస్‌గా మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగడం లేదని వారన్నారు.

బోసిబోయిన సచివాలయం

బోసిబోయిన సచివాలయం

ఈ నెల 27వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి సీమాంధ్ర సచివాలయ ఉద్యోగాలు బయలుదేరారు. దీంతో సచివాలయం పూర్తిగా బోసిబోయింది.

English summary
Seemandhra ministers at CLP: No staff in Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X