హైద్రాబాదే: టి-సీమాంధ్ర నేతల భేటీలు, అధినేత్రితో కన్నా
హైదరాబాద్/న్యూఢిల్లీ: మంత్రుల బృందం(జివోఎం) ముందుకు మంగళవారం వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మంత్రి జానా రెడ్డి నివాసంలో సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తెలంగాణ నేతలు ఆంటోని కమిటీ నివేదికపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు అఖిల పక్షం ముందు చెప్పాల్సిన అంశాల పైన చర్చిస్తున్నారు. భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదని నేతలు నిర్ణయానికి వచ్చారు.
భేటీకి ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. సీమాంధ్రుల అనుమానాలు, అపోహలను కేంద్రం తొలగిస్తుందన్నారు. విభజన ఆగే పరిస్థితి లేదని, హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నామన్నారు. హైదరాబాదులో ఉన్న వారంతా చట్టం దృష్టిలో సమానమేనని, రెండు రాష్ట్రాలు వద్దన్న వారు మూడు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాదును యుటిగా అంగీకరించేది లేదన్నారు.

జానా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సారయ్య, డికె అరుణ, సునితా లక్ష్మా రెడ్డి, ఎంపిలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మరోవైపు ఢిల్లీలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, పళ్లం రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, జెడి శీలం తదితరులు పాల్గొన్నారు. వారు హైదరాబాదు పైనే ప్రధాన డిమాండ్లు వినిపించేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ప్రధానికి ఇచ్చేందుకు ఆరు పేజీల నివేదికను తయారు చేసుకున్నారు. అలాగే సీమాంధ్రకు భారీ ప్యాకేజీని డిమాండ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications