జనసేన కోసం రూ.వందల కోట్ల వ్యాపారం వదిలేసిన ఎన్నారై, కీలక పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్‌గా పులి శేఖర్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జనసేనాని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.

జనసేనకు పని చేసేందుకు వచ్చారు
ఎన్నారై పులి శేఖర్ అమెరికాలో తనకు ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని వదులుకొని జనసేన పార్టీ కోసం పని చేసేందుకు వచ్చారనని జనసేనాని అన్నారు. ఆయన నిబద్ధతతో పని చేసేందుకు వచ్చారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ఆయనలో సామాజిక స్పృహ, పాలనలో పారదర్శకత ఉండాలనే తపన బాగా ఉన్నాయని చెప్పారు. డల్లాస్‌లో గతంలో ఆయన తనను కలిసి ఆలోచనలు పంచుకున్నారని చెప్పారు.

శేఖర్‌కు కీలక బాధ్యతలు
పార్టీ నిర్వహణలో కీలకమైన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్‌కు చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అతను అమెరికాకు వెళ్లి, ఓ కంపెనీని ప్రారంభించారని చెప్పారు. చిన్నగా ప్రారంభించి, ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యాపారాన్ని వదిలేసి, జనసేనకు పని చేసేందుకు వచ్చారని చెప్పారు. పార్టీ కోసం ఆయన మంచి సలహాలు ఇస్తారని చెప్పారు.

ఏమీ ఆశించి రాలేదు
ఈ సందర్భంగా పులి శేఖర్ మాట్లాడుతూ.. సిద్ధాంత బలంతో నిర్మితమైన పార్టీ జనసేన అన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, భావజాలం తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. ఏపీ వారి నాయకత్వం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తోందని చెప్పారు. పవన్ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ఏపీలో, దేశంలో మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తాను ఏమీ ఆశించి రాలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదైనా చేయాలనుంటున్నారని, ఆయనకు అండగా నిలబడేందుకు వచ్చానని చెప్పారు.












Click it and Unblock the Notifications