సీఎం జగన్ కు థాంక్స్ - వారి కోసమే సినిమా రేట్లపై రచ్చ : సీనియర్ నటుడి కీలక వ్యాఖ్యలు..!!
సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం పై వివాదం ముదురుతోంది. టాలీవుడ్ వర్సస్ ఏపీ ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్దం సాగుతోంది. సినీ పరిశ్రమ నుంచి కొందరు చేస్తున్న వ్యాఖ్యలు..వాటికి ఏపీ మంత్రుల సమాధానం నడుమ ఈ ఎపిసోడ్ సాగుతోంది. ఈ సమయంలో తెలంగాణకు చెందిన సీనియర్ నటులు సీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేసారు. "మా" ఎన్నికల సమయంలోనూ ఆయన అధ్యక్ష బరిలో నిలించేందుకు ముందుకు వచ్చి..ఆ తరువాత తన ప్రతిపాదన విరిమించుకున్నారు.

సీఎం జగన్ కు అభినందనలు
ఇక, ఇప్పుడు సినిమా టిక్కెట్ల వివాదం పైన స్పందించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ... మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్చ పైన భిన్నాభిప్రాయాలు ఉన్నా.. టిక్కెట్ రేట్లు పెంచటం ద్వారా ఇష్టమైన వాళ్లే వెళతారు..లేని వాళ్లు వెళ్లరనే అభిప్రాయాలు ఉన్నాయన్నారు. పాన్ ఇండియా పేరుతో పెద్ద సినిమాలు తీస్తున్న వారు.. సినిమా నిర్మాణంలో భాగంగా కింది స్థాయి వర్కర్లకు కాల్ షీట్ కు ఇచ్చే రుసుము ఏమైనా పెంచారా అని ప్రశ్నించారు. వాళ్లకు పెంచకుండా.. పెద్ద సినిమాల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడకు వెళ్తుందని నిలదీసారు.

ఆ నిర్మాతల కోసమే ఈ రచ్చ
ఇండస్ట్రీలోని ఆ పది మంది నిర్మాతల కోసమే సినిమా టిక్కెట్ల ధరల పైన రచ్చ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మామూలు సినిమా అభిమాని టికెట్ రేటు రూ.1,000 ఉంటే ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా చూడగలరని ప్రశ్నించారు. హీరో మీద అభిమానంతో వెళ్లి..టిక్కెట్ ధర ఎంత అయినా పర్వాలేదని భావించే వారి విషయం వేరని చెప్పారు. అయితే, సినిమా వినియోగదారులు ఎవరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని చెప్పుకొచ్చారు. మూడు నాలుగు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా సినిమా నడుస్తూ ఉందని సీవీఎల్ చెప్పారు.

ఆర్జీవీ ట్వీట్లతో పతాక స్థాయికి వివాదం
ఇప్పటికే ఈ అంశం పైన న్యాయస్థానంలో కేసు దాఖలు కావటంతో..కోర్టు సూచన మేరకు ప్రభుత్వం కమిటీ నియమించింది. ఆ కమిటీ అధ్యయనం చేసి..అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇచ్చిన తరువాత నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమయంలోనే కొందరు ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు బడుతూ వ్యాఖ్యలు చేస్తుండగా... నాగార్జున లాంటి వారు మాత్రం తన సినిమాకు ఈ నిర్ణయం వలన ఎటువంటి నష్టం లేదని చెప్పుకొచ్చారు.

కమిటీ నివేదిక తరువాతనే ఫైనల్
టిక్కెట్ల ధరలు పెరిగితే డబ్బులు వస్తాయని... తక్కువగా ఉంటే తగ్గుతాయని నాగార్జున స్పష్టం చేసారు. ఇదే ఎపిసోడ్ లో దర్శకుడు ఆర్జీవీ.. మంత్రి పేర్ని నాని మధ్య ట్వీట్ వార్ నడిచింది. ఇంత రచ్చ సాగుతున్నా.. టాలీవుడ్ నుంచి ఈ టిక్కెట్ల అంశం పైన ప్రభుత్వంతో చర్చకు ప్రముఖులు ముందుకు రాకపోవటం పైనా అటు టాలీవుడ్.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోంది. ఇక, ఇప్పుడు సీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications