ఏపీలో సీనియర్ సిటిజన్ కార్డులు... వృద్ధులకు వరమిచ్చిన కేంద్రం!

సీనియర్ సిటిజన్ కార్డు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులు అందరూ దీని గురించే చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందడం కోసం 60 ఏళ్ళు నిండిన వృద్ధుల కోసం గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డును ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం పెద్దగా ప్రాచుర్యం లేని ఈ కార్డు పైన ఇటీవల కాలంలో వృద్ధుల నుండి దరఖాస్తులు వెల్లువగా మారాయి.

సీనియర్ సిటిజన్ కార్డుతో ప్రయోజనాలు
అసలు ఏమిటి సీనియర్ సిటిజన్ కార్డు.. ఈ కార్డు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇది వృద్ధులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కొన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు, రాయితీలు పొందడానికి ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు సీనియర్ సిటిజన్ కార్డు. ఇక ఈ కార్డును పొందడానికి రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో లేదా సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.

Senior Citizen Cards The Center has given a boon to the elderly rush in ap

సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తు ఇలా
దరఖాస్తు ఫారాన్ని పూరించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను దానికి జోడించాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, వయసు ధ్రువీకరణ పత్రం, బ్లడ్ గ్రూప్ తదితర వివరాలను ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి. అప్లై చేసిన తర్వాత దరఖాస్తును పరిశీలించి, దరఖాస్తులో ఉన్న అన్ని వివరాలను వెరిఫై చేసి సీనియర్ సిటిజన్ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డు తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

సీనియర్ సిటిజన్ కార్డుతో లాభాలివే
సీనియర్ సిటిజన్ కార్డుతో రైల్వే ప్రయాణంలో రాయితీలు పొందొచ్చు. రైళ్లలో ప్రయాణం చేసే 60 ఏళ్లు పైబడిన వారికి రైళ్ళలో రాయితీలు లభిస్తాయి. ఇక కొన్ని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పథకాలను అందించి, వారికి రాయితీలను కూడా ప్రకటిస్తాయి. వాటిని కూడా ఉపయోగించుకోవడానికి ఈ కార్డుతో వీలవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు, సేవలు అందుతాయి.

Take a Poll

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్డులను డిజిటల్ గా ఇచ్చేందుకు చర్యలు
ఆరోగ్య మరియు వైద్య సేవలలో రాయితీలకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం తీసుకువచ్చే పథకాలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్డులను డిజిటల్ గా అందించడానికి చర్యలు చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా సర్వీస్ ని తీసుకువచ్చి ఈ కార్డును పొందేందుకు వీలు కల్పిస్తున్నారు.

1వ తేదీ నుంచి ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డుల కొత్త సర్వీస్
మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాల్లోనూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సర్వీస్ తో 50 వేలకు పైబడి సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 85 నుండి 90 శాతం వరకు కార్డులు కూడా అందుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే ఈ కార్డు వృద్ధుల పాలిట ఒక వరం అని చెప్పక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+