Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌ను కలిసిన ప్రతిపక్షాల సీనియర్ నేత- నాలుగుసార్లు ఎమ్మెల్యేగా..!!

అమరావతి: మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటోన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పక్షాలు కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్నాయి. రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని- ఆ ఒక్కటీ అమరావతే కావాలనీ డిమాండ్ చేస్తోన్నాయి. ఈ విషయంలో అమరావతి ప్రాంత రైతులను తెర మీదికి తీసుకొస్తోన్నాయి.

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీలు కూడా మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఇదివరకు అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమాల్లో ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు స్వయంగా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాలరాస్తోందంటూ మండిపడ్డాయి.

Senior CPM leader and former MLA Paturu Ramaiah meets CM YS Jagan at his camp office

ఈ పరిణామాల మధ్య సీపీఎం సీనియర్ నేత, మాజీ శాసన సభ్యుడు పాటూరు రామయ్య.. వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. క్యాంప్ కార్యాలయం అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో నిర్మిస్తోన్న 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, అంబేద్కర్‌ స్మృతివనం పనులపై చేపట్టిన స‌మీక్ష ముగిసిన వెంటనే- వైఎస్ జగన్ ఆయనను కలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా వారి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. అనంతరం పాటూరు రామయ్య ఆరోగ్య ప‌రిస్థితిని వైఎస్ జ‌గ‌న్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. వైఎస్ జగన్ ను పాటూరు రామయ్య మ‌ర్యాద‌పూరకంగా క‌లిశారని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలుస్తోంది.

సీపీఎం సీనియర్ నేత పాటూరు రామయ్య.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. గతంలో ఆయన నాలుగుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన సొంత నియోజకవర్గం- ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిడుమోలు. నెల్లూరు ఆయన సొంత జిల్లా. తన నియోజకవర్గంలో వేలాది మందికి ఇళ్ల స్థలాలను ఇప్పించారు. ఇప్పటికీ ఆయనకు సొంత ఇళ్లు లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+