నాగార్జున వల్లే నాశనమయ్యాను... డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
ఏ రంగంలో అయినా గెలుపోటములు సహజం. అయితే చిత్ర పరిశ్రమలో మాత్రం ఓటమి వెనక అనేక కారణాలుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఓటమి వెనక వ్యక్తులు కూడా ఉంటారు. ఒక సినిమా ప్లాపైందంటే దానికి కారణం దర్శకుడు, హీరో, కథ.. ఇలా అనేకం ఉంటాయి. కథ బాగున్నప్పటికీ టేకింగ్ మంచిగా రాకపోవచ్చు. హీరోలు కథలో వేలుపెట్టి మార్పు చేర్పులు చేయడంవల్ల మొదటికే మోసం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు పరిశ్రమలో చాలా జరిగాయి.
తాజాగా సీనియర్ దర్శకుడు వీరభద్ర చౌదరి.. తన కెరీర్ నాశనమవడానికి కారణం హీరో అక్కినేని నాగార్జున అని చెబుతున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన అహనా పెళ్లంట సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత సునీల్ తో పూలరంగడు చేశారు. రెండు హిట్లు అందుకున్న వీరభద్రమ్ కు అక్కినేని నాగార్జునతో పనిచేసే అవకాశం లభించింది.

నాగార్జున, రిచా గంగోపాధ్యాయ జంటగా నటించిన భాయ్ సినిమా 2013 లో విడుదలైన భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ దెబ్బ ఎక్కడివరకు తగిలిందంటే.. వీరభద్రం ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీడియా ఎదుటకు వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాయ్ సినిమా ఫ్లాప్ గురించి చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.
భాయ్ కథను రాసుకున్నప్పుడు కామెడీ కథే అని, ఆ కథకు హీరో నాగార్జున అని ముందుగా తెలియదన్నారు. తర్వాత స్టార్ హీరోతో సినిమా అనేసరికి మార్పులు చేయించారు. సినిమా అంతా మిస్ ఫైర్ అయ్యింది. ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ సినిమాను తీసిన తాను ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నానన్నారు. ఆకాశం లో విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని కిందకు తోసేసినట్లు అనిపించిందని, తాను ఇలా ఉండడానికి కారణం నాగార్జున సినిమానే అన్నారు. ఆయనవల్లే తన కెరీర్ నాశనమైందన్నారు. ఈ సినిమా తర్వాత తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications