బిజెపిలోకి సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరు ఆదివారంనాడు బిజెపిలో చేరారు. సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి బిజెపి కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ బిల్లు రాజకీయ పార్టీల విశ్వసనీయతకు పెద్ద పరీక్ష అని ఆయన అన్నారు
తెలంగాణ బిల్లును పార్లమెంటులో గెలిపించి తమ విశ్వసనీయతను నిరూపించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఎందుకు ప్రవేశపెట్టాలని అనుకుంటుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు
తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిసినప్పటికీ సీమాంధ్ర నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల మధ్య విద్వేషాలు పెంచవద్దని ఆయన కోరారు. పదకొండు వందల మంది ఆత్మహత్యలకు కచ్చితంగా కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్శించారు. సోనియా గాంధీ తమ పాలిట దెయ్యమేనని ఆయన అన్నారు.

బిజెపిలోకి సీనియర్ జర్నలిస్టు
తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి ఆదివారంనాడు బిజెపిలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

విధానాలు నచ్చే..
బిజెపి విధానాలు నచ్చడం వల్లనే తాను పార్టీలో చేరుతున్నట్లు శైలేష్ రెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పారు. మోడీతోనే ఉత్తమ పాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

రంగారెడ్డి జిల్లా నాయకులు..
రంగా రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి సూచన..
నరేంద్ర మోడీ పట్ల ఉన్న ఆదరణను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు కార్యకర్తలు వచ్చే 60 రోజులను పార్టీకి పూర్తిగా వినియోగించాలని కిషన్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications