కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడికి టీడీపీ టికెట్: పార్టీకి సీమ నేత గుడ్‌బై
TDP Janasena BJP alliance: వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. శివరామరాజు, కే అప్పల్నాయుడు, జేడీ రాజశేఖర్, పోతిన మహేష్, పితాని బాలకృష్ణ, అత్తర్ చాంద్ భాషా.. వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. మరికొందరు వైఎస్ఆర్సీపీలో చేరారు.

అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు, రాజంపేట లోక్‌సభ లోక్‌సభ ఇన్‌ఛార్జీ గంటా నరహరి సైతం ఇదివరకే పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. పొత్తులో భాగంగా రాజంపేట లోక్‌సభ టికెట‌్‌ను భారతీయ జనతా పార్టీ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ రమేష్ రెడ్డి కూడా ఆయన బాటలో సాగనున్నారు. టీడీపీకి ఆయన గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
2014, 2019 ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రమేష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ- క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
ఈ ఎన్నికల్లో రమేష్ రెడ్డికి టికెట్ దక్కలేదు. రామ్‌ప్రసాద్ రెడ్డిని రాయచోటి బరిలో దింపారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు రామ్ ప్రసాద్ రెడ్డి. ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల కొంతకాలంగా రమేష్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇక రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications