చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ, మీకు సున్నా సీట్లు గ్యారెంటి, గంటా
ఉదయం నిద్ర లేచినప్పటినుంచి చిల్లర రాజకీయాలు చేయడం ఎలా అంటూ వైసీపీ నాయకులు ఆలోచిస్తారని, ఇలాంటి రాజకీయాలు చెయ్యడంలో ఆ పార్టీ నాయకులు మొదటి వరుసలో ఉంటారని, వాళ్లకు వాళ్లే పోటీ అని నిరూపించుకుంటారని ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజల సమస్యల గురించి వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టవలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
వైసీపీ నాయకులు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఓడిపోతాడని, ఆ తర్వాత వైసీపీకి సున్నా సీట్లు వచ్చి చరిత్ర హీనులుగా నిలిచిపోతారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖపట్నంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మా నినాదం, విధానం అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు, వైసీపీ నాయకులకు ప్రస్తుతం ఎలాంటి పనీపాటా లేకుండా పోయిందని, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం పైన బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని, ఇలా చేసిన తర్వాతే వారికి రాత్రిపూట నిద్ర పడుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యంగంగా అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను కొన్ని సంవత్సరాల క్రితం రాజీనామా చేశానని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. అయితే మూడు సంవత్సరాల పాటు తన రాజీనామాను అప్పటి జగన్ ప్రభుత్వం అంగీకరించలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తన ఓటు హక్కు చెల్లకూడదనే ఉద్దేశంతో హడావిడిగా తన రాజీనామాను అప్పటి స్పీకర్ అంగీకరించారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నో ప్రాణ త్యాగాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చిందని, తెలుగు వారి గుండె చప్పుడు గా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఇప్పటికైనా వైసీపీ నాయకులు చిన్న రాజకీయాలు చేయడం మానుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి సూచనలు సలహాలు ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తాను రాజీనామా చేస్తే ఇదే ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది రాలేనా చేశారు చెప్పాలని ఆ విషయం పై బహిరంగ చర్చ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మాజీమంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసిపి నాయకులు కి సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications