ఢిల్లీలో కలిసిరాని చంద్రబాబు,జగన్ సెంటిమెంట్..!!
Delhi Election Results 2025: ఢిల్లీలో సామాన్యుడి పార్టీని సామాన్యుడే దెబ్బ కొట్టాడు. ఆప్ కు ఊహించని పరాభవం మిగిలింది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. 48 స్థానాల్లో విజయం దాదాపు ఖాయమైంది. కేజ్రీవాల్ సహా ఆప్ ప్రముఖులంతా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ చిరునామా గల్లంతు అయింది. ఢిల్లీ ఎన్నికల్లో పని చేస్తుందనుకున్న సెంటిమెంట్ పని చేయలేదు. ఏపీ, జార్ఖండ్ లో కనిపించిన సెంటిమెంట్ ఢిల్లీలో వర్కవుట్ కాలేదు. ఫలితంగా ఆప్ కోట బద్దలు చేసి ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టనుంది.
సామాన్యుడి దెబ్బకు విలవిల
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ముఖ్యులను సామాన్యులే చావు దెబ్బ కొట్టారు. 13 ఏళ్ల అధికారం ఇక ముగిసింది. 27 ఏళ్ల తరువాత బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. భారీ మెజార్టీతో బీజేపీకి ప్రజలు అధికారం అప్పగించారు. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 36 మేజిక్ ఫిగర్. బీజేపీ ఇప్పటికే 47 స్థానాల్లో గెలుపు ఖాయం చేసుకుంది. ఆప్ 23 స్థానాలకు పరిమితం అయింది. ఆప్ - కాంగ్రెస్ పొత్తు లేకుండా వేర్వేరుగా పోటీ చేయటం బీజేపీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవకుండానే పోటీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ ఫలితం ఇండియా కూటమి కొనసాగింపు.. ఐక్యత పైన ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.

చంద్రబాబు, జగన్ తరహాలో
జైలుకు వెళ్లి వచ్చిన నేతలకు సానుభూతి కలిసి వస్తుందనే నమ్మకం ఢిల్లీ ప్రజలు వమ్ము చేసారు. జైలు నుంచి వచ్చిన నేతలకు ఇతర రాష్ట్రాల్లో పట్టం కట్టారు. ఏపీలో జగన్, 2024 ఎన్నికల్లో చంద్రబాబు ను ఏపీ ఓటర్లు గెలిపించారు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ కు ప్రజలు మద్దతుగా నిలిచారు. ఢిల్లీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి ఆప్ టాప్ లీడర్లు ముగ్గురూ ఓడిపోయారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లటంతో సీఎం గా అతీశీ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో చివరి వరకు ఆశీతికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.

పనిచేయని సానుభూతి
న్యూ ఢిల్లీలో కేజ్రీవాల్ పై పర్వేష్ వర్మ అనూహ్య విజయం సాధించారు. గతంలో బీజేపీ సీఎం గా పని చేసిన సాహిబ్ సింగ వర్మ కుమారుడు పర్వేష్. ప్రస్తుతం సీఎం అభ్యర్దిగా రేసులో ఉన్నారు. దే విధంగా జంగ్‌పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోదియా ఓటమి పాలయ్యారు. ఆయన పైన బీజేపీ అభ్యర్ధి తర్వీందర్‌సింగ్ విజయం సాధించారు. ఇక, చివరి రౌండ్ వరకు పోరాటం చేసిన సీఎం అతీశి చివరకు కాల్ కాజీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిని ఓడించి ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా జైలుకు వెళ్లిన మరో నేత సత్యేంద్ర జైన్ షాకూర్‌బస్తీలో ఓటమి పాలయ్యారు. దీంతో, జైలుకు వెళ్తే గెలుస్తారనే సానుభూతి చర్చకు ఢిల్లీ ఓటర్లు ముగింపు పలికారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications