డెడ్ బాడీ పార్శిల్ కేసులో ట్విస్టులు- శవం ఎవరిది ? ఏపీ టూ తెలంగాణ..!

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి మండలం యండగండిలో తాజాగా ఓ మహిళకు డెడ్ బాడీ పార్శిల్ వచ్చిన షాకింగ్ ఘటనపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇంటి నిర్మాణం కోసం ఎలక్ట్రికల్ సామాన్లు బుక్ చేస్తే శవం రావడంతో సదరు మహిళ షాక్ కు గురైంది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో శ్రీధర్ వర్మ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అయితే ఈ శవం ఎవరిది అన్న అంశం మాత్రం ఇంకా తేలలేదు.

డెడ్ బాడీ పార్శిల్ కేసులో ప్రధాన అనుమానితుడు శ్రీధర్ వర్మ కోసం ఆరా తీస్తే కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నిందితుడిగా భావిస్తున్న శ్రీధర్‌ వర్మకు ముగ్గురు భార్యలు ఉన్నట్లు తేలింది. తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారు లోంచి ముఖానికి మాస్క్ ధరించి ఒక మహిళ దిగింది. ఆమెకూ ఈ హత్యకూ సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళ ఎవరనే విషయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

serial twists in parcel dead body case in west Godavari district three wives to accused

మరోవైపు ఉండి మండలం యండగండి గ్రామంలో నివశిస్తున్న 55 ఏళ్ల రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు కాగా..పెద్ద కుమార్తె సాగి తులసికి నిడదవోలుకు చెందిన శ్రీనివాసరాజుతో వివాహం కాగా భర్తతో నిడదవోలులో నివాసం ఉండేది. అతను అప్పులు చేసి పదేళ్ల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో తిరిగి యండగండి గ్రామానికి వచ్చేసింది. ప్రస్తుతం వేరుగా గరగపర్రు గ్రామం, పాలకోడేరు మండలంలో ఉంటూ భీమవరం దుర్గ స్టిల్స్ లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది. అలాగే రంగరాజు చిన్న కుమార్తెకు వివాహం కాగా భర్తతో మొగల్తూరు గ్రామంలో ఉంటోంది.

పార్శిల్ వచ్చిన తులసికి యండగండి జగనన్న కాలనీలో స్థలం రాగా అక్కడ ఇల్లు కట్టుకుంటోంది. ఈమె ఆర్థిక పరిస్థితిని బట్టి క్షత్రియ ఫౌండేషన్ లో నమోదు కాగా, ఈమెకు ఆర్థిక సహాయం నిమిత్తం, ఇంటి సామాన్లు ఈమె తల్లితండ్రులు యండగండిలో ఉండటంతో ఆ అడ్రస్ కి పంపిస్తున్నారు. ఇంతకుముందు పెయింట్ డబ్బాలు, పార్సెల్ వచ్చాయి. పార్సిల్స్ రాబోయే విషయాన్ని ముందుగా వాట్సప్ ద్వారా తెలియచేసేవారు. రెండు రోజుల క్రితం కరెంటు సామాన్లు, మోటారు వస్తాయని ఈమెకు వాట్సప్ లో రావడంతో సాయంత్రానికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఒక చెక్క పెట్టెలో పార్సిల్ తెచ్చి ఇచ్చారు.

అది ప్యాక్ చేసి తాళం వేసి ఉంది. తాళం వేసి కవర్లో పెట్టి దానితో పాటూ ఒక లెటర్ పెట్టెకు తగిలించారు. లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మీరు కోటి 30 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని రాసి ఉన్నట్లు ఉంది. ఆ పెట్టెను ఓపెన్ చేసి చూస్తుండగా..కుళ్ళిన చెడు వాసన తో నాలుగు కవర్లలొ చుట్టి పెట్టిన ఒక డెడ్ బాడీ ఉండటంతో తులసి భయ బ్రాంతులకు గురై చుట్టు ప్రక్కల వారికి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కేసు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. గురువారం సాయంత్రం ఓ కారులో చెక్క పెట్టెతో పాటు ఓ మహిళను సమీప గ్రామమైన ఉనుదుర్రు రోడ్డుపై దింపినట్లు సమాచారం. అక్కడ నుంచి ఆ మహిళ రోడ్డుపై వెళ్లే ఆటోను మాట్లాడి యండగండిలోని ముదునూరు రంగరాజు ఇంటికి పార్సిల్ తీసుకువచ్చిందని ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. ఆ మహిళ ఎవరు? ఆమెను, శవంతో ఉన్న చెక్కు పెట్టను కారులో దింపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సాగి తులసి తండ్రికి ఉన్న మూడున్నర ఎకరాలు పొలం కోసం అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న కుమార్తె భర్తగా చెబుతున్న ఒక వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి అతని ఆచూకీ లేకపోవడంపై అతనిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులను దర్యాప్తు కోసం పిలిపించారు. అనుమానితుడి ఫోన్ కాల్ సిగ్నల్ చివరగా తెలంగాణ రంగారెడ్డి పరిధిలో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ పార్సిల్ లో వచ్చిన మృతదేహానికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే మూడు రోజుల క్రితం ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి చంపినట్లు ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ డెడ్ బాడీ కనిపించకుండా పోయిన రంగరాజు దా లేక మరి ఎవరిది అన్నది తేలాల్సి ఉంది. తులసి సోదరి భర్త చుట్టూ ఈ డెడ్ బాడీ పార్సెల్ మిస్టరీ మొత్తం తిరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+