కోర్టుకు కాల్ డేటాలను సమర్పించిన సర్వీస్ ప్రొవైడర్లు
విజయవాడ: ఫోన్‌ట్యాపింగ్ కేసులో డొకొమో, వోడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్‌డేటాను శుక్రవారం కోర్టుకు అందజేశారు. ఇప్పటికే ఐడియా, ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్లు 29 నెంబర్ల కాల్‌డేటాను కోర్టుకు ఇచ్చారు. దీంతో కోర్టు తుదుపరి విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్‌పై మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బిఎస్‌ఎన్‌ఎల్, ఐడియా, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు కాల్ డేటా వివరాలను ఆగస్టు 14వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ కేసులో కూడా విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ కోర్టు తనకు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఇచ్చిన కాల్ డేటా వివరాలను చూడకుండా సీల్డ్ కవర్‌ను యథాతథంగా హైకోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్‌పుర్కార్ ఆదేశించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications