అమరావతి పాదయాత్రకు హైకోర్టు షాక్- జగన్ సర్కార్ వాదనకే మొగ్గు.. !
ఏపీలో ఒకే రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ అరసవిల్లి వరకూ రైతులు చేపట్టిన పాదయాత్ర వివాదాల కారణంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం వద్ద నిలిచిపోయింది. రైతుల యాత్రకు వ్యతిరేకంగా స్ధానిక వైసీపీ నేతలు నిరసనలకు దిగడం, ఓ దశలో దాడులు, ప్రతిదాడులు కూడా జరగడంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే హైకోర్టు గతంలో పాదయాత్రకు పెట్టిన షరతులపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంది.
అమరావతి పాదయాత్రకు గతంలో ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే రైతుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పలు షరతులతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. ఇందులో పాదయాత్రలో 600 మందే పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. కానీ రైతులు మాత్రం తమకు 2000 మంది వరకూ అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అలాగైతేనే తాము 600 మంది ఏకకాలంలో పాదయాత్ర చేయగలరని, ఇందులో ఎవరైనా అలసిపోయినా, అనారోగ్యం పాలైనా మిగిలిన వారు వారి స్ధానంలో పాదయాత్ర చేస్తారని తెలిపారు. కానీ ఈ వాదనతో ప్రభుత్వం ఏకీభవించలేదు. దీంతో రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

రైతుల తరఫున అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో ఈ మేరకు సడలింపులు కోరుతూ గతంలో రిట్ అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పాదయాత్రపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పులో పార్టీలు కాని వారు వేస్తే అనుమతించబోమని స్పష్టం చేసింది. రైతుల పాదయాత్రకు సంబంధం లేని వారు పిటీషన్ దాఖలు చేయడం సరికాదని తెలిపింది. రైతాంగ సమాఖ్య తరపున పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్‌లు కోరగా...మధ్యంతర దరఖాస్తులను కొట్టివేయడంతో రిట్ అప్పీల్‌కు కూడా విచారణ అర్హత లేదని హైకోర్టు వెల్లడించింది.












Click it and Unblock the Notifications