Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wakf Act: కేంద్రానికి బిగ్ షాక్- వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో...!

పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదించిన వివాదాస్పద వక్ఫ్ చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పలు వివాదాస్పద క్లాజ్ లతో కూడిన వక్ఫ్ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఇవాళ దీనిపై ముందుకెళ్లొద్దని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే తమ ఆదేశాలపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో ముస్లింలకు ఊరట దక్కినట్లయింది.

దేశంలోని ముస్లిం దాతృత్వ ఆస్తుల నిర్వహణను నియంత్రించే చట్టాలలో మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ రెండోరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు "వక్ఫ్ నియామకాలు ఉండవని, అలాగే ప్రస్తుత స్ధితిలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

setback to centre as supreme court orders status quo on wakf act

రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చడం వంటి చట్టంలోని కొన్ని భాగాల అమలును సుప్రీంకోర్టును మే 5 వరకూ నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు ఈ చట్టంలోని 'వక్ఫ్ బై యూజర్' నిబంధనను కూడా డీనోటిఫై చేయరాదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అప్పటివరకూ వక్ఫ్ బోర్డులకు ఎలాంటి నియామకాలు జరగవని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

వక్ఫ్ చట్టంలో భారీ మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లోనూ కేంద్రం ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో చట్టంగా మారింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే కేంద్రంతో పాటు ప్రతివాదులుగా ఉన్న ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాల లాయర్లు వద్దని కోరారు. ఈ చట్టంలోని పలు క్లాజ్ లపై సుప్రీంకోర్టు నిన్న అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవాళ జరిగిన విచారణలో ఏకంగా స్టేటస్ కో ఇచ్చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+