రఘురామను టార్చర్ పెట్టిన డీఎస్పీకి సుప్రీంకోర్టు షాక్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని రాజద్రోహం కేసులో అరెస్టు చేసి కస్టడీలో హింసించిన వ్యవహారంలో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనకు ఊరట నిచ్చేందుకు కోర్టులు తిరస్కరించాయి. దీంతో సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది.

వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశాక కస్టడీలో హింసించిన ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న విజయ్ పాల్ ను నిందితుడిగా చేర్చారు. అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలే ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం ఈ పిటిషన్ ను కొట్టేసింది.

setback to dsp Vijay paul in sc who tortured raghurama krishanam raju in past ysrcp regime

అప్పట్లో రఘురామను టార్చర్ చేసిన కేసులో విజయ్ పాల్ తో పాటు ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ తో పాటు మాజీ సీఎం జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో విజయ్ పాల్ ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆయన విషయంలో గుంటూరు పోలీసులు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మిగతా నిందితులు కూడా కోర్టుల్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+