బాలినేనికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ..! ఆ పిల్ డిస్మిస్..

ఏపీలో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలులో ఎన్నికల అక్రమాల విషయంలో ఈసీ నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బాలినేనిని చుక్కెదురైంది. ఈ మేరకు బాలినేని దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలులో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు బాలినేని ఆరోపిస్తున్నారు. దీనిపై ఈసీ విచారణ కొనసాగుతోంది.

setback to janasena leader balineni srinivasa reddy in hc over poll irregularities petition

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత తన ఓటమికి ఈవీఎంలలో అక్రమాలే కారణమని ఆరోపిస్తూ ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. వీటిలో అక్రమాల నిర్ధారణకు ఈసీ చేసిన పరిశీలనను తప్పుబడుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై గతంలోనే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వు చేసింది. ఇవాళ బాలినేని పిటిషన్ ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈవీఎంల అక్రమాల విషయంలో ఈసీ వద్దే తేల్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఒంగోలులో ఈవీఎం అక్రమాలపై మాక్ పోలింగ్ నిర్వహించిన ఈసీ.. అక్రమాలు గుర్తించలేదు. దీంతో ఈసీ తీసుకునే ఫైనల్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. అయితే గతంలో ఈ కేసు వేసినప్పుడు వైసీపీలో ఉన్న బాలినేని.. ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+