విజయసాయిరెడ్డికి బిగ్ షాక్- వైసీపీ, టీడీపీ ఒకేసారి..!

వైసీపీ మాజీ ఎంపీ, రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించి తాజాగా తిరిగి రాజకీయాలు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డికి ఇవాళ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లూ తన మాజీ పార్టీ వైసీపీలో కోటరీ రాజకీయాలపైనే విమర్శలు ఎక్కుపెడుతున్న ఆయన మద్యం కుంభకోణం విషయంలో తాను విజిల్ బ్లోయర్ గా వ్యవహరిస్తానంటూ ప్రకటించారు. మద్యం స్కాంలో మిగిలిన నిందితుల బట్టలు విప్పేందుకు సహకరిస్తానన్నారు. ఈ ప్రకటనపై వైసీపీతో పాటు టీడీపీ కూడా మండిపడ్డాయి.

విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో పేర్లన్నీ బయటపెడతానంటూ చేస్తున్న హెచ్చరికలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఇవాళ తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారని అంబటి ఆరోపించారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారన్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారని, కూటమి కోసం తన పదవిని వదిలేశారని గుర్తుచేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందన్నారు. వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు.

setback to vijayasai reddy as ysrcp and tdp both launched verbal attack against him

మరోవైపు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కూడా సాయిరెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. "నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు, క్రైమ్ బ్లోవర్ వి" అంటూ విమర్శలు చేశారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్‌లో కూర్చొని విజయసాయి రెడ్డి నిర్వహించిన డిస్టిలరీల దందా, తయారు చేయించిన నకిలీ మద్యం వ్యవహారాలపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. త్వరలోనే ఆ బాధితులు సీఐడీకి ఫిర్యాదు చేయనున్నారని, అప్పటికి విజయసాయి రెడ్డి బట్టలు విప్పే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. "తస్మాత్ జాగ్రత్త!" అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+