గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ..! ఆ దంపతులిద్దరూ గుడ్ బై ! టీడీపీలోకి..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నేతల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సొంత పార్టీల్లో సీట్లు దక్కని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలో వైసీపీకి కీలకమైన సామాజిక వర్గానికి చెందిన భార్యాభర్తలు ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు రాజీనామా లేఖ పంపారు. అనంతరం టీడీపీ తీర్దం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో ఉన్న ప్రస్తుత గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో తాడికొండ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించిన కత్తెర క్రిస్టినాకు జగన్ చివరి నిమిషంలో ఉండవల్లి శ్రీదేవిని తెరపైకి తెచ్చి షాకిచ్చారు. అయితే జగన్ ఆదేశాల మేరకు ఆమె కోసం పనిచేసి గెలిపించారు. ఆ తర్వాత క్రిస్టినాకు జడ్పీ ఛైర్మన్ గా జగన్ బాధ్యతలు ఇచ్చారు.

అనంతరం తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీలోకి ఫిరాయించడంతో ఈసారి ఆమె స్ధానంలో తనకు టికెట్ ఇస్తారని క్రిస్టినా ఆశించారు. కానీ మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈసారి ప్రత్తిపాడు నుంచి మాజీ హొంమంత్రి సుచరితకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్న కత్తెర దంపతులు ఇావాళ వైసీపీని వీడారు. త్వరలో కొల్లూరులో జరిగే చంద్రబాబు సభలో వీరిద్దరూ టీడీపీలో చేరబోతున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో టీడీపీకి ఇది ప్లస్ కానుంది.












Click it and Unblock the Notifications