ఏపీలో మరో భారీ ఎన్ కౌంటర్- 7గురు మావోల మృతి--50కి చేరిన అరెస్టులు..!
ఏపీలో మావోయిస్టుల ప్రభావం ఏ స్ధాయిలో ఉందో గుర్తుచేసేలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు నేతల్ని హతమార్చిన పోలీసులు.. ఇవాళ మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురిని చంపేసారు. వీటి వివరాల్ని ఇంటెలిజెన్స్ ఛీఫ్ మహేశ్ చంద్ర లడ్డా కొద్దిసేపటి క్రితం విజయవాడలో వెల్లడించారు. ఇవాళ కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు జరిగాయని, ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉందని ఆయన తెలిపార.
ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని లడ్డా తెలిపారు. నిఘా వర్గాలు వారి కదలికలు పై ప్రత్యేక దృష్టి పెట్టాయన్నారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారని ఆయన తెలిపారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారం తో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉన్నారని దృష్టి పెట్టామన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ,కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులు లను పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు.

రాష్ట్ర చరిత్ర లో ఇంతమంది కీలక వ్యక్తును పట్టుకోవడం ఇదే ప్రధమం అని లడ్డా తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నట్లు వెల్లడించారు. వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రి ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారన్నారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. తమ ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందన్నారు.

తమకు ముందే సమాచారం వచ్చినా.. వారిపై నిఘా పెట్టామన్నారు. వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించామని,
అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని లడ్డా తెలిపారు. తెలంగాణ లో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారన్నారు. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారన్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. వారి మూవె మెంట్, ప్లాన్ల పై ఇతర సమాచారం లేదని ఆయన తెలిపారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదన్నారు.












Click it and Unblock the Notifications