AP Heat Wave : ఏపీలో రేపు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు..

ఏపీలో వేసవి తాపంతో పాటు వడగాల్పుల ప్రభావం కూడా అంతకంతకూ ఎక్కువవుతోంది. ఐఎండి అంచనాల ప్రకారం రేపు 6 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

రేపు వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 06 ఉన్నాయి. వీటిలో అల్లూరి జిల్లా- కూనవరం,అనకాపల్లి జిల్లా- నాతవరం, కాకినాడ జిల్లా- కోటనందూరు, మన్యం జిల్లా- జీయమ్మవలస, కొమరాడ, పార్వతీపురంఉన్నాయి. అలాగే రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 174గా పేర్కొంది. వీటి వివరాలు ఇలా ఉన్నాయి.

summerdp

అల్లూరి జిల్లా 10, అనకాపల్లి 17, తూర్పుగోదావరి 17, ఏలూరు17, గుంటూరు12, కాకినాడ 13, కోనసీమ 4, కృష్ణా 9, నంద్యాల 8, ఎన్టీఆర్ 16, పల్నాడు 7, పార్వతీపురంమన్యం 9, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 3, విజయనగరం 22, పశ్చిమ గోదావరి 1,వైఎస్ఆర్ 1 మండలంలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. శనివారం అనకాపల్లి 10, కాకినాడ 2, విజయనగరం 1 మండలంలో తీవ్రవడగాల్పులు, 55 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+