హైటెక్ సెక్స్‌రాకెట్ రట్టు, పట్టుబడ్డ ముంబై యువతి
హైదరాబాద్/విజయవాడ: గుంటూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సత్యనారాయణపురంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి గత నెల రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిన్న సాయంత్రం అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి ముంబై యువతి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ (ఎహెచ్‌టిసి) పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసుల బృందం సత్యనారాయణ పురంలోని సదరు అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా జరుగుతున్న వ్యభిచార కేంద్రంపై దాడి చేసి హైదరాబాద్‌కు చెందిన బ్రోకర్‌తో పాటు ముంబైకు చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. అనకాపల్లికి చెందిన వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన యువతులతో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయనకు హైదరాబాద్‌తో పాటు ముంబై, కలకత్తా, తదితర నగరాలకు చెందిన యువతులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తుంటాడు. వారికి పది రోజుల చొప్పున కాంట్రాక్ట్ కుదుర్చుకొని వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల ముంబై నుంచి యువతిని 10 రోజులకు రూ.70వేలకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని తీసుకు వచ్చాడు. ఏకంగా యువతి విమానంలో రావడం, అనేక రాష్ట్రాల యువతులతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications