షారుక్ ఖాన్ "జవాన్" కలెక్షన్ల సునామీ; మహేశ్ బాబు రివ్యూ, ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!!

అట్లీ- షారుక్ ఖాన్ కాంబోలో తెరకెక్కిన జవాన్ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల తోనే రికార్డు సృష్టించింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది జవాన్. దీంతో జవాన్ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు 70 కోట్ల రూపాయలను వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఒక అంచనా. బాలీవుడ్ చరిత్రలో ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రోజునే బిగ్గెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా జవాన్ నిలిచింది. ఈ సినిమాలో షారూక్ ఖాన్ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

Shahrukh Khan Jawan box office Collections; Mahesh Babu Review, Anand Mahindra praises!!

తాజాగా షారుక్ ఖాన్ నటించిన ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయన చిత్ర బృందం పై పొగడ్తల వర్షం కురిపించారు. జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా అని, అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ను అందించారని మహేష్ బాబు పేర్కొన్నారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని మహేష్ బాబు తెలిపారు.

ఇక మరోవైపు జవాన్ సినిమాపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన షారుక్ ఖాన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. షారుక్ ఖాన్ నేచురల్ రిసోర్స్ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. సహజంగా దేశాలన్నీ తమ సహజ వనరులను భద్రంగా కాపాడుకుంటాయని, వాటిని మైనింగ్ చేసి, విదేశీ మారకద్రవ్యం కోసం ఎగుమతి చేస్తాయని పేర్కొన్నారు.

ఇదే కోవలో ఇప్పుడు ఇక షారుక్ ఖాన్ నేచురల్ రిసోర్స్ గా ప్రకటించాల్సిన సమయం బహుశా వచ్చింది అనుకుంటా అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా అంచనాలకు మించి జవాన్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+