వైసీపీ దిశ యాప్ స్ధానంలో కూటమి కొత్త యాప్ ఇదే..!
ఏపీలో మహిళల భద్రతకోసమంటూ గత వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ ను తీసుకొచ్చింది. భారీ ఎత్తున మహిళలతో పాటు పురుషులతోనూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేయించారన్న విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే అంతే స్ధాయిలో మహిళల్ని వేధింపుల నుంచి కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన తర్వాత అప్పట్లో వైఎస్ జగన్ తెచ్చిన ఈ యాప్ ను పక్కనబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మండలిలో హోంమంత్రి ప్రకటన చేశారు.
వైసీపీ దిశ యాప్ స్ధానంలో తాము శక్తి యాప్ తీసుకొస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. వైసీపీ తెచ్చిన దిశ యాప్ తో మగవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగిందని, కానీ తాము తెచ్చే శక్తి యాప్ తో మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అనిత తెలిపారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న తాము శక్తి యాప్ ను మహిళల కోసం ప్రారంభిస్తామని ఇవాళ శాసన మండలిలో ప్రకటించారు.

పని చేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి వైసీపీ ఎంఎల్‌సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు. ఇందులో పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్‌హెచ్ చట్టం అమలు చేస్తామన్నారు.మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో చట్టపరమైన పరిణామాల అవగాహన కోసం అవగాహన కల్పిస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications