ప్రచారం లో పవన్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల ... పవన్ కళ్యాణ్ జనసేనను టీడీపీలో కలిపేస్తారు

Recommended Video

    AP Assembly Election 2019 : ప్రచారం లో పవన్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల || Oneindia Telugu

    ఏపీలో ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఒక పక్క టిడిపి కోసం జాతీయ నాయకులు ప్రచారం చేస్తుంటే, మరో పక్క బిజెపి కోసం ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ రంగంలోకి దిగితే , పవన్ కళ్యాణ్ కు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి రంగంలోకి దిగనున్నారు.

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేస్తారన్న షర్మిల

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేస్తారన్న షర్మిల

    ఇప్పటికే వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా గుంటూరు లో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల అటు చంద్రబాబు నే కాదు ఇటు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చారు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని తెలుగు దేశం పార్టీలో కలిపేస్తారని వైసీపీ నేత షర్మిల పేర్కొన్నారు. రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ అని.. చంద్రబాబు డైరెక్టర్ అని షర్మిల అన్నారు. డైరెక్టర్ చెప్పిందే ఆ యాక్టర్ చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

    చంద్రబాబునే కాదు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన షర్మిల

    చంద్రబాబునే కాదు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన షర్మిల

    పవన్ కు ఓటు వేస్తే, టీడీపీకి ఓటు వేసినట్లే అని తేల్చిచెప్పారు షర్మిల. ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా వైసిపి కచ్చితంగా విజయకేతనం ఎగురవేస్తుందని, ప్రజలందరి మద్దతు తమ పార్టీకి ఉండాలని ఆమె కోరారు. చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషం అని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబుని చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుతో పారిపోతుందన్న షర్మిల వైసీపీకి ఏ పార్టీతోనూ పొత్తులు లేవని షర్మిల మరోసారి స్పష్టం చేశారు.

    ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

    ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్న జగన్ సోదరి.. బాబు, పవన్ లే లక్ష్యం

    ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్న జగన్ సోదరి.. బాబు, పవన్ లే లక్ష్యం

    చంద్రబాబు వస్తే రాష్ట్రంలో కరువొచ్చిందన్నారు వైఎస్ షర్మిల.. చంద్రబాబుని సాగనంపాలని ప్రజలను కోరారు. బైబై బాబు.. అనేది ప్రజాతీర్పు కావాలన్నారు. వైసీపీ తరుఫున షర్మిల ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తూ బాబుపై మాటలదాడి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ను వదలని షర్మిల టీడీపీ, జనసేన టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రోజుకో అబద్ధం, పూటకో మోసంతో గడిపేశారని ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని కోరారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరిన షర్మిల జనసేన టీడీపీ లో విలీనంఖాయం అని చెప్పి జనసేనపైన కూడా విరుచుకు పడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+