నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీ రాజా ... 'మా' ఎన్నికల ఓటమి ప్రతీకారం భలే తీర్చుకున్నాడుగా

తెలుగు రాష్ట్రాల్లో ఇది రిటర్న్ గిఫ్టుల సీజన్ . గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఇబ్బంది పెట్టినందుకు సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆతర్వాత ఎవరు మాట్లాడినా రిటర్న్ గిఫ్ట్ గురించే మాట్లాడటం జరిగింది. ఇటీవల జరిగిన 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటమిపాలైన శివాజీరాజా ప్యానెల్ తమ ఓటమికి కారణం అయిన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి సంచలనం సృష్టించారు. అన్న మాట ప్రకారం అదును చూసిమరీ తన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు శివాజీ రాజా. ఇంతకీ శివాజీ రాజా ఏం చేశారో తెలుసా .

మా ఎన్నికల ఓటమికి నాగబాబు కారణంగా శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్

మా ఎన్నికల ఓటమికి నాగబాబు కారణంగా శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్

'మా' ఎన్నికల తరువాత తన ఓటమికి కారణమైన నాగబాబుకు సరైన సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేశ్ ప్యానల్ తో పాటు.. జీవితా రాజశేఖర్లకు మద్దతు ఇవ్వటంతో వారి ప్యానల్ అనూహ్యంగా విజయం సాధించింది. తాము ఓటమి పాలు కావటానికి చివర్లో నాగబాబు మద్దతు ఇవ్వటంగా శివాజీ రాజా ఆరోపణలు చేశారు.

జీవితారాజశేఖర్ కు నాగబాబు మద్దతిస్తే వైసీపీలో చేరి మెగా బ్రదర్ పై విమర్శలు చేస్తున్న జీవితారాజశేఖర్

జీవితారాజశేఖర్ కు నాగబాబు మద్దతిస్తే వైసీపీలో చేరి మెగా బ్రదర్ పై విమర్శలు చేస్తున్న జీవితారాజశేఖర్

ఇక నాగబాబు మద్దతు ఇచ్చిన జీవితా రాజశేఖర్ లు వైఎస్సార్ కాగ్రెస్ పార్టీలో చేరటమే కాదు.. మెగా బ్రదర్ పై విమర్శలవర్షం కురిపిస్తున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ లపై చాలా అగ్రెస్సివ్ గా ముందుకు పోతున్నారు. దీంతో జీవిత రాజశేఖర్ లకు మద్దతు ఇచ్చి నాగబాబు తప్పు చేశారన్న భావన ప్రస్తుతం వ్యక్తం అవుతోంది . తాము ఓడిపోవటానికి కారణమైన నాగబాబుకు సరైన సమయంలో సరైనరిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన శివాజీ రాజా అందుకు తగ్గట్లే ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ నాగబాబుకు ఇబ్బందికరంగా మారింది.

600 మంది 'మా' సభ్యులకు ఏమి చెయ్యని వాడు ప్రజలకేం చేస్తాడు అంటూ నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీ రాజా

600 మంది 'మా' సభ్యులకు ఏమి చెయ్యని వాడు ప్రజలకేం చేస్తాడు అంటూ నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీ రాజా

శివాజీ రాజా నాగబాబుకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగబాబు పుణ్యమా అని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' దిగజారిపోయిందని పేర్కొన్నారు. అభివృద్ధిలో ‘మా' ను రెండేళ్లు వెనక్కి నెట్టిన ఘనత నాగబాబుదేనని ఆయన ధ్వజమెత్తారు. 600 మంది ఉన్న మాకు ఏమీ చేయని నాగబాబు నర్సాపురం ప్రజలకు మాత్రం ఏదో ఎందుకు చేస్తాడంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఇక సమయం చూసి మరీ నాగబాబుకు ఓటు వెయ్యకండి అని చెప్పి అందుకు గల కారణం కూడా చెప్పి నాగబాబును ఇరకాటంలోకి నెట్టారు శివాజీ రాజా .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+