Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు షాక్: పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే భేటీ!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసిపి నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు సొంత పార్టీ నేతల ఆందోళనకు కారణంగా మారింది. దీంతో పలువురు వైసిపి ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వైసీపీకి షాక్ ఇవ్వడానికి జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రెడీ అయినట్టు సమాచారం.

కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబుకు ఈసారి టికెట్ లేనట్టు తేలడంతో, ఆ స్థానం నుండి మాజీమంత్రి తోట నరసింహాన్ని బరిలోకి దింపేందుకు వైసిపి అధిష్టానం సిద్ధమైనదన్న సమాచారంతో ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జ్యోతుల చంటి బాబుకు స్పష్టమైన సంకేతాలు వైసిపి ఇవ్వడంతో ఆయన టిడిపిలో చేరే ప్రయత్నాలు సాగించారని సమాచారం.

Shock for Jagan: YCP MLA Jyotula chantibabu met with Pawan Kalyan!!

అయితే జ్యోతుల నెహ్రూ నుండి వ్యతిరేకత రావడంతో టిడిపి అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టిందని తెలుస్తోంది. ఇక ఈ సమయంలో ఆలస్యం అమృతం విషమని భావించిన జ్యోతుల చంటిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసిపి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు భేటీ అయ్యారు.

రాత్రి దాదాపు 45 నిమిషాల పాటు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, నాదెండ్ల మనోహర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబులతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే చంటిబాబు.. జనసేనలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ భేటీ కాకినాడ జిల్లాలో చర్చినీయాంశమైంది. జ్యోతుల చంటిబాబు పార్టీ మార్పు పక్కా అని తెలుస్తోంది.

ఇక జ్యోతుల చంటిబాబు 2009, 2014 ఎన్నికలలో జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారి 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు ఈ ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు టికెట్ లేదని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో జనసేన, టిడిపిల వైపు జ్యోతుల చంటిబాబు చూస్తున్నారు.జగన్ కు త్వరలోనే షాక్ ఇస్తారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+