కడప రెడ్డెమ్మకు చంద్రబాబు మార్క్ షాక్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పటికే అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు గీత దాటిన వారి పైన చర్యలు తీసుకోవడానికి వెనకాడడం లేదు. తాజాగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ముఖ్య అనుచరులలో ఒకరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అనుచరుడిపై మంత్రి నారాయణ ఫిర్యాదు
ఈ విషయాన్ని పార్టీ వర్గాలు నేడు వెల్లడించాయి. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అనుచరుడు పైన చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. మాధవి రెడ్డి పేరు చెప్పి తిరుమలేష్ అనే వ్యక్తి విద్యా సంస్థల నుండి డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం పైన మంత్రి నారాయణ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

shock for mla madhavi reddy Kadapa MLA follower suspended after Minister Narayana complaint

విద్యాసంస్థల నుండి వసూళ్ళకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అనుచరుడు
ఇటీవల కడపలో జరిగిన టిడిపి మహానాడు కార్యక్రమంలో కూడా తిరుమలేష్ ఎమ్మెల్యే పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. తిరుమలేష్ చివరకు మంత్రి నారాయణ కు చెందిన విద్యాసంస్థల నుండి కూడా డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించడంతో నారాయణ దృష్టికి వెళ్ళింది. దీంతో మంత్రి నారాయణ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్పందించిన టిడిపి అధిష్టానం తిరుమలేష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

గతంలో ఎమ్మెల్యే పీఏపైన ఆరోపణలు
ఇది ఇలా ఉంటే ఏప్రిల్ నెలలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి పిఏ పైన కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే పీఏగా పనిచేసిన వాహిద్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒంటరి మహిళను మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను రెండవ పెళ్లి చేసుకున్నాడని, మరో ముగ్గురు అమ్మాయిలను మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి.

ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అనుచరుడు సస్పెండ్, మాధవీ రెడ్డికి షాక్
ఈ విషయం పైన ఎమ్మెల్యే మాధవి రెడ్డి వెంటనే స్పందించి వాహిద్ ను విధుల నుంచి తొలగించారు. అంతే కాదు దీనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా ఆమె ముఖ్య అనుచరుడిపైన కూడా ఆరోపణలు రాగా టిడిపి అధిష్టానం సస్పెండ్ చేసి చర్యలకు ఉపక్రమించింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అనుచరుడిని సస్పెండ్ చేయడం ద్వారా ఎమ్మెల్యేకు కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+