ఆళ్లగడ్డలో అఖిలకు షాక్ : ఏకమైన గంగుల కుటుంబం : వైసిపికి మద్దతంటూ ప్రకటన..!
Recommended Video

కర్నూలు జిల్లాలో టిడిపికి మరో షాక్. ప్రధానంగా ఆళ్లగడ్డ..నంద్యాల లో ప్రభావితం చేస్తారని భావించిన గంగుల ప్రతాప రెడ్డి వైసిపి అభ్యర్దికి మద్దతు ప్రకటించారు. టిడిపిలో కొనసాగుతున్న గంగుల ప్రతాప రెడ్డి అనూహ్యంగా తన మద్దతు దారులతో సమావేశమయ్యారు. ఆళ్లగడ్డ లో తమ కుటుంబ వారుసుడికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు కర్నూలు జిల్లో ఇది సంచలనం గా మారింది.

వైసిపి అభ్యర్దికి మద్దతు ప్రకటన..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిల ప్రియకు భారీ షాక్. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి అనూ హ్యం గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. గంగుల ప్రతాప్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీ పీలో చేరారు.. ఆయన అదే పార్టీలో కొనసాగుతుండడంతో గంగుల వర్గం ఓట్లు చీలి తమకు లాభిస్తుందని అఖిల ప్రియ భావించారు. కానీ మంగళవారం గంగుల ప్రతాప్‌రెడ్డి ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేం ద్రా రెడ్డి , కుటుంబ సభ్యులు గంగుల మనోహర్‌రెడ్డి, గంగుల సుదర్శన్‌రెడ్డి, గంగుల ఫణిక్రిష్ణారెడ్డి, గంగుల భరత్‌రెడ్డి, లతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రణాళికపై చర్చించి.. గంగుల బిజేంద్రారెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలం టూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. గంగుల కుటుంబమంతా ఏకం కావడంతో నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ గానే భావిస్తున్నారు.

నంద్యాల అభ్యర్ది మీరే అన్నారు..కానీ
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు తనను సాయం అడిగినందున ఆ పార్టీ అభ్యర్థి కోసం పని చేసానని ప్రతాప రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తనతో మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్‌కు సరైన అభ్యర్థి ఎవరూ లేరని, మీరే సరైన అభ్యర్థి అని తనతో చెప్పారన్నారు. అయితే..ఇప్పుడు కనీసం తనను సంప్రదించకుండానే ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేశారన్నారు. మాట తప్పడం చంద్రబాబు నైజమని అందరూ చెప్పారని, కానీ అప్పట్లో ఆయన మాటలను నమ్మాల్సి వచ్చిందని అన్నారు. ప్రజాబలం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తానన్న చంద్రబాబు ..చివరకు ధన బలం చూసే ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేశారన్నది స్పష్టమవుతోందన్నారు. అయితే, టిడిపిని వీడుతున్న ట్లుగా మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. ప్రతాప రెడ్డి ఆళ్లగడ్డ తో పాటుగా నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నియోజ క వర్గాల్లోనూ ప్రభావితం చేయగలగిన నేత.

ఒక్కటైన గంగుల కుటుంబం...
నంద్యాల ఎన్నికలకు ముందు గంగుల ప్రభాకర్ రెడ్డి వైసిపి లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీగా వైసిపి అధినేత జగన్ అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో ఆయన తనయుడిని ఆళ్లగడ్డ వైసిపి అభ్యర్దిగా ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ఆళ్ల గడ్డ నుండి వైసిపి అభ్యర్దిగా గెలిచిన శోభా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన ఉప ఉన్నికల్లో అఖిల వైసిపి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రవేశించారు. తండ్రి భూమా నాగిరెడ్డి తో కలిసి టిడిపిలోకి ఫిరాయించారు. ఆ తరువాత నాగిరెడ్డి ఆకస్మికం గా మరణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రి వర్గంలో అఖిలకు స్థానం కల్పించారు. ఇక, ఇప్పుడు టిడిపి లో ఉన్న గంగుల సోదరులకు భూమా వర్గానికి చాలా కాలంగా విబేధాలు ఉన్నాయి. తనకు ఇచ్చిన మాట అమలు చేయకపోవటంతో టిడిపిలో ఉన్న గంగుల ప్రతాప రెడ్డి సైతం తన నిర్ణయాన్ని మార్చుకొని..వైసిపి అభ్యర్దిని గెలిపించా లని కోరుతున్నారు. దీంతో..గంగుల కుటుంబ ఏకం కావటం..వైసిపికి మద్దతివ్వంతో అక్కడ ఏ మేర వారు ప్రభావం చూపిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications