'కేశవ రెడ్డి' బాధ్యత 'చైతన్య'కు, ఆస్తులపై నో: సుప్రీంలో సుజనకు షాక్
హైదరాబాద్: కేశవ రెడ్డి విద్యా సంస్థల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైతన్య విద్యా సంస్థలకు అప్పగించింది. విద్యార్థులు అకడమిక్ కెరీర్ కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కేశవ రెడ్డి విద్యా సంస్థల ఆస్తులు, అకౌంట్ల పైన మాత్రం చైతన్య విద్యా సంస్థలకు ఎలాంటి అధికారం లేదు.
కేశవ రెడ్డి విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నాయి. గత ఏడాది కేశవ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేశవ రెడ్డి పైన కేసు నమోదయిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని అతను ఆరోపణలు ఎదుర్కొన్నారు.

తన విద్యా సంస్థల అభివృద్ధి కోసం కేశవ రెడ్డి ఇతరుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇతను తన పేరిట పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారు. అదే సమయంలో కేశవ రెడ్డి వసూలు చేసిన మొత్తాన్ని తీసుకున్న వారికి ఇవ్వడంలో విఫలమయ్యాడు. దీనిపై విచారణ జరుగుతోంది.
సుజన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
సుజనా గ్రూపు సంస్థలో చోటుచేసుకున్న అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని రిట్ పిటిషన్ వేసిన వినోద్‌కుమార్ ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 32ప్రకారం పిటిషన్ విచారణార్హం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. సరైన కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.












Click it and Unblock the Notifications