స్లీపర్ బస్సులపై రాష్ట్రాలకు కీలక ఆదేశాలు.. వారికి షాక్!

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇటీవల చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులలో చోటు చేసుకుంటున్న దుర్ఘటనలు, బస్సులలో ప్రజల భద్రతపైన ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. స్లీపర్ బస్సుల విషయంలో మార్గదర్శకాలను పంపించింది.

ప్రైవేటు స్లీపర్ బస్సులలో ఘోర ప్రమాదాలు
దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ స్లీపర్ బస్సులలో ప్రయాణించిన పలువురు ఇటీవల ఘోర ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడం, ఎమర్జెన్సీ డోర్స్ ను మూసివేయడం, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వంటి అనేక కారణాలతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు, ఘోరంగా ప్రాణనష్టం జరిగినట్లు ఇటీవల నివేదికలు పేర్కొన్నాయి.

Shock to private travels Key orders to states on sleeper buses

ఫిర్యాదుల ఆధారంగా మానవ హక్కుల కమీషన్ నిర్ణయం
కర్నూలు బస్సు ప్రమాదం మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలో ఇతర బస్సు ప్రమాదాలు, సౌదీ అరేబియాలో జరిగిన దారుణ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలను జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ట్రావెల్స్ సంస్థల పైన సంయమనంతో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఆ బస్సులు నిలిపివెయ్యాలని ఉత్తర్వులు జారీ .. ప్రైవేట్ ట్రావెల్స్ కు షాక్
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్ బస్సులను నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు తాజాగా ఇటీవల జరిగిన ఘటన అధికారులు తరచూ బస్సులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దని జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు షాక్ అనే చెప్పాలి.

స్లీపర్ బస్సులలో ప్రమాదాలు ఇందుకే
ప్రస్తుతం నడుస్తున్న బస్సులలో 50 శాతానికి పైగా స్లీపర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులలో లోపల భాగం ఇరుగ్గా ఉండడం, ప్రయాణికులు బయటకు త్వరగా రాలేకపోవడం, అగ్ని ప్రమాదాలను నియంత్రించే రక్షణ వ్యవస్థ లేకపోవడం వంటివి కారణమవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్లీపర్ బస్సులు విషయంలో కీలక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+