వణికిస్తున్న కార్డియాక్ అరెస్టులు.. ఏపీ ఆదోనిలో జిమ్ చేస్తూ యువకుడు గుండెపోటుతో మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదోనిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో జిమ్ చేస్తుండగా గుండె పోటుతో కుప్పకూలి ఓ యువకుడు మృతి చెందాడు.
ఇప్పుడు అందరినీ కార్డియాక్ అరెస్టులు వణికిస్తున్నాయి. అప్పటివరకు బాగున్న మనుషులు ఎక్కడ చూసినా క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతుంది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట గుండెపోటుకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు అందరినీ మన జీవన విధానం గురించి ఆలోచించేలా చేస్తుంది.

చిన్న వయసుల వాళ్లలోనూ కార్డియాక్ అరెస్ట్ లు
ఊబకాయంతో ఉండి, శారీరక వ్యాయామం లేని వారే కాదు, ఫిట్ నెస్ ఉన్నవారు, రోజూ వ్యాయామం చేసే వారు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, జిమ్ కి వెళ్లి రోజు ఎక్సర్సైజులు చేసేవాళ్లు, చిన్న చిన్న వయసుల వాళ్లు కూడా కార్డియాక్ అరెస్టులకు గురికావడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. గతంలో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కవుట్ చేస్తూ కుప్ప కూలిపోతే, ఇటీవల తారకరత్న హార్ట్ ఎటాక్ తో 23 రోజులపాటు ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్లాడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

సడన్ గా గుండెపోటు.. ప్రాణాలు కోల్పోతున్న యువత
ఆ తర్వాత అనేక మంది వరుసగా గుండెపోటుకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి మేనల్లుడు గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక నిన్న గుజరాత్ లో ఒక వధువు మరికాసేపట్లో పెళ్లి జరగబోతుంది అనగా గుండెపోటుతో కుప్పకూలి, ప్రాణాలు విడిచింది. మొన్న పెళ్లి పీటల మీద ఒక వరుడు ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఇక ఇటువంటి వరుస ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో గుండె పోటుపైన ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు.

జిమ్ చేస్తుండగా కుప్పకూలిన యువకుడు
ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదోనిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో జిమ్ చేస్తుండగా కుప్పకూలి ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యువకుడు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇటీవల అతనికి పెళ్లి కుదిరింది . నిన్న ఉదయం పట్టణంలోని జిమ్ కి వెళ్లిన అతను, అక్కడ వ్యాయామం చేస్తుండగా కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో స్నేహితుడితో కలిసి బయటకు వచ్చాడు.

ఆస్పత్రికి వెళ్ళే లోపే యువకుడు మృతి
ఆ తర్వాత స్నేహితుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్లి తిరిగి వచ్చేలోపు కళ్ళు తిరిగి పడిపోయాడు. స్థానికులు స్పందించి సపర్యలు చేయడంతో కాసేపటికి తేరుకుని మళ్లీ కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. అతను గుండె పోటుకు గురయ్యారని, అందుకే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications