విశాఖలో దారుణం.. సిగిరెట్ కోసం ఘర్షణ; బాలుడి గొంతుకోసి హతమార్చిన స్నేహితులు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏపీ నుండి విశాఖపట్నంలో వ్యసనాలకు బానిసలైన మైనర్ బాలురు, మరో బాలుడిని క్షణికావేశంలో హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కేవలం సిగరెట్ కోసం బాలుర మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, స్నేహితులే మరొక బాలుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి హతమార్చారు. ఇక ఈ షాకింగ్ వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్న తో కలిసి జీవనం సాగిస్తుంది. కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని నూకాలమ్మ పోషించుకుంటుంది. అయితే చిన్న చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. సిగిరెట్లు, గుట్కా వంటి చెడు వ్యసనాలు నేర్చుకున్న చిన్నా పాత నగరంలోని విస్కీ అనే ఒక రౌడీషీటర్ ని ఆదర్శంగా తీసుకుని తల్లి మాట వినకుండా ప్రవర్తిస్తున్నాడు.

shocking crime in Visakha.. minor boys Clash for cigarettes; friends killed a boy!!

ఇక తన వయసు ఉన్న మరికొందరు బాలురతో కలిసి సెప్టెంబర్ 20వ తేదీన విశాఖలో వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్నాడు చిన్న. సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మరో నలుగురు బాలురు తో కలిసి సిగరెట్లు తాగాడు. ఇక సిగరెట్ విషయంలో వారి మధ్య గొడవ జరగగా క్షణికావేశంలో నలుగురు చిన్న గొంతు కోసి హతమార్చారు.

శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేసుకున్న నలుగురు సంచిలో మృతదేహాన్ని మూటకట్టి దాచిపెట్టారు. ఆపై తెల్లవారుజామున ఒక ఆటో డ్రైవర్ తో వినాయక చవితి సామాగ్రి నిమజ్జనం చేయాలని మాట్లాడుకుని మృతదేహాన్ని చేపల రేవు వద్దకు తీసుకువెళ్లి అక్కడ సముద్రంలో పారేసి వెళ్ళిపోయారు.

అయితే మృతదేహం తీరానికి కొట్టుకు రావడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటో డ్రైవర్ని గుర్తించి విచారణ మొదలుపెట్టారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల విచారణలో బాలురు నేరం చేసామని అంగీకరించారు.

దీంతో ఆ నలుగురిని జువైనల్ హోంకు తరలించారు. అయితే బాలురు మధ్య ఘర్షణ జరగడానికి గంజాయి కారణమై ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కోణంలో కూడా కేసును దర్యాప్తు జరుపుతున్నారు. ఏదిఏమైనా మైనర్ బాలురు ఇంత దారుణానికి ఒడిగట్టటం విశాఖ వాసులను షాక్ కు గురి చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+