తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకెక్కిన భక్తుడు.. లిక్కర్ కావాలని షాక్!
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఒక వ్యక్తి చొరబడి ఆలయ అధికారులకు, సామాన్య భక్తులకు కూడా షాక్ ఇచ్చాడు. స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసిన తర్వాత విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి మహాద్వారం గుండా లోనికి ప్రవేశించి ఆలయ గోపురం పైకెక్కి నానా హంగామా చేశాడు.
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి
మద్యం మత్తులో ఉన్న అతను ఆలయ గోపురం పైకెక్కి తాను కిందికి దిగాలంటే మద్యం బాటిల్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. విజిలెన్స్, తిరుపతి ఈస్ట్, పోలీసులు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి కిందికి దిగాలని అతనికి ఎంత చెప్పినా గోపురం పైన కూర్చుని కిందికి దిగడానికి నిరాకరించాడు. పోలీసులు విజిలెన్స్ సిబ్బందికి అతనిని కిందికి దించడం మూడు గంటలు పట్టింది.

మూడు గంటల పాటు తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో రచ్చ
మూడు గంటల పాటు నానా హంగామా చేసిన వ్యక్తిని ఎట్టకేలకు కిందికి దించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు షాక్ తిన్నారు. అయితే ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు.
మద్యం బాటిల్ ఇస్తేనే దిగుతానని డిమాండ్
కిందికి రావాలంటే మద్యం బాటిల్ ఇస్తేనే దిగుతానని డిమాండ్ చేయడంతో ఫైర్ సిబ్బంది నిచ్చెనలను వేసి, తాళ్లతో కట్టి బలవంతంగా కిందికి దించారు. గోపురం పైన ఉన్న కలశాలను లాగేందుకు ఆ వ్యక్తి ప్రయత్నం చేయగా అది సాధ్యం కాలేదు అన్నారు. అయితే నిన్న రాత్రి నిజామాబాద్ కు చెందిన తిరుపతి అను ఒక వ్యక్తి భక్తుడి లానే శ్రీ గోవింద రాజస్వామి ఆలయం లోనికి ప్రవేశించారు .
గోపురం పైకి ఎక్కిన వ్యక్తిపై కేసు నమోదు
ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడుమన ఉన్న గోపురం పైకి ఎక్కడం జరిగింది. వెంటనే విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది అతనిని గుర్తించి పోలీస్ , ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మద్యం మత్తులో ఉన్న అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది అని టిటిడి సీపీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.
కలశాలు లాగే యత్నం.. సాధ్యం కాలేదన్న అధికారులు
ఆ వ్యక్తి గోపురంపైన ఉన్న కలశాలను లాగేందుకు ప్రయత్నించినప్పటికీ, అవి సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఆలయంలోకి అతడు ఎలా ప్రవేశించాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారికి అపచారం జరిగిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications