పెళ్ళిలో డబ్బు వెదజల్లిన ఘనుడు ... డబ్బు ఎక్కువైతే మాకివ్వరా బాబు అంటున్న నెటిజన్లు !

ఘనంగా వివాహం జరిగింది. వధూవరులిద్దరినీ ఆశీర్వదించే శుభ ముహూర్తం రానే వచ్చింది. బంధువులందరూ దీవిస్తారు అనుకున్నచోట గంప నిండా డబ్బులతోటి ఆ పెళ్లి వేడుకలో తన డబ్బును దర్పాన్ని ప్రదర్శించడానికి ఓ పెద్దాయన వేదిక పైకి వచ్చాడు. వచ్చిందే తడవుగా గంపలో ఉన్న 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లను వధూవరుల మీద వెదజల్లుతూ తన ధన అహంకారాన్ని ప్రదర్శించాడు. అక్కడ ఉండి ఈ తంతు చూస్తున్న వారంతా సదరు ప్రబుద్ధుడు చేస్తున్న పనికి నివ్వెరపోయారు. ఎంత ధనం ఉంటే మాత్రం మరీ ఇంతలానా అంటూ లోలోపల ఫీలయ్యారు.

ఇక అలా వధూవరులపైన నోట్ల కుమ్మరిస్తున్న పెద్దాయన క్రింద పడినటువంటి నోట్లను తీసుకోవడానికి వచ్చిన పిల్లలను, యువకులను చాలా చులకనగా చూస్తూ అక్కడి నుంచి పంపించి వేశాడు. ఇక గంపలో ఉన్న డబ్బులు అంతా వధూవరుల మీద గుమ్మరించి తన ధన బలాన్ని చూపించుకున్నాడు. ఇప్పుడు వధూవరుల మీద ఈ డబ్బులు కుమ్మరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇంత అహంకారమా అంటూ అది చూసిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నీకు డబ్బులు ఎక్కువ అయితే మాకు ఇవ్వు నాయనా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు డబ్బులు వినియోగించే పద్ధతి ఇది కాదని, డబ్బు అవసరమున్నవారు, కనీసం తినడానికి తిండి కూడా లేని వారు బోలెడంత మంది ఉన్నారని, డబ్బులు ఎక్కువైతే అలాంటి వారికోసం ఆ డబ్బును ఉపయోగిస్తే బాగుంటుందని సలహాలు కూడా ఇస్తున్నారు.

Shocking.. A man showered the money on wedding couple .. if you have more money just give us !

ధనమేరా అన్నిటికి మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అన్న విషయాన్ని మరిచిపోయిన సదరు ప్రబుద్ధుడికి ధనం విలువ తెలిసేలా చాలా ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. డబ్బును ఇష్టారాజ్యంగా అలా వధూవరుల మీద కుమ్మరించిన ప్రబుద్ధుడు తీరు కాస్త చిరాకుగా, ధనం అంటే లెక్కచేయని అతని విధానం ఆ ధనలక్ష్మి కి సైతం భవిష్యత్తులో కాస్త పరాకుగా అనిపించే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా అవసరానికి డబ్బులు వాడితే బావుంటుంది కానీ, ఇలా అనవసరంగా వెదజల్లడానికి డబ్బులు వాడితే అస్సలు బాగోదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+