కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు, సోదరుడు ... రీజన్ తెలిస్తే షాక్!!
వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులు కనికరం కూడా లేకుండా కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇక ఈ దారుణంలో తోడబుట్టిన సోదరుడు కూడా పాల్గొన్నాడు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే..ప్రేమించటమే ఆ యువతి చేసిన నేరం.

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో గొడవ
వివరాల్లోకి వెళితే రాయచోటి కు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది.ఈ ప్రేమ వ్యవహారం ఇష్టంలేని కుటుంబ సభ్యులు, వేరే పెళ్లి చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఏ సంబంధం వచ్చినప్పటికీ వచ్చిన సంబంధాలు అన్నింటిని ఆమె స్వయంగా చెడగొడుతుంది.అంతేకాదు గత కొద్ది రోజులుగా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానంటూ తల్లిదండ్రులతో గొడవ పడుతుంది.అతనికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆ యువతి పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు.

పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు, సోదరుడు
కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ఆ యువతి వినిపించుకోలేదు.బలవంతంగా అయినా ఒప్పించే ప్రయత్నం చేసినా తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెడుతోంది.దీంతో విసిగి వేసారిపోయిన తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక,కూతురు తమ మాటను కాదంటున్న ఆగ్రహంతో కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా పెట్రోలు పోసి నిప్పంటించారు. తల్లిదండ్రులు చేస్తున్న ఈ చర్యను అక్కడే ఉన్న సోదరుడు కూడా వారించలేదు.
Recommended Video

రిమ్స్ లో చికిత్స .. కేసు నమోదు చేసిన పోలీసులు
మంటల్లో కాలుతున్న యువతి హాహాకారాలు చేస్తున్న క్రమంలో ఆమె అక్క, స్థానికులు అక్కడకు వచ్చి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.పరువు కోసం తల్లిదండ్రులే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం నేటి రోజుల్లోనూ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications