దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో షాకింగ్ ట్విస్ట్.. ఇంటిస్థలం నాదంటూ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ!!
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీలో మరొక షాకింగ్ చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా నిర్మించిన ఇంటి కోసం అటు దువ్వాడ సతీమణి వాణి, మాధురి పోటీపడుతుండగా మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటి స్థలం తనదంటూ ఓ రిటైర్డ్ టీచర్ తాజాగా మీడియాతో మాట్లాడాడు.
దువ్వాడ ఇంటి స్థలం తనదన్న రిటైర్డ్ టీచర్
దువ్వాడ శ్రీనివాస్ తన వద్ద నుండి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడని తనకు ఇంకా 60 లక్షల రూపాయలు ఆ ఇంటి స్థలం తాలూకు బకాయి ఉన్నాడని ఇంకా తనకు బకాయి ఉన్న ఇంటి స్థలంలో కట్టిన ఇంటి మీద వారికి ఎలా హక్కు ఉంటుందంటూ రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం మీడియా ముఖంగా వాపోయాడు.

ఇంటి స్థలం కొని చెక్కులిచ్చారు.. కానీ క్యాష్ కాలేదు
దువ్వాడ శ్రీనివాస్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కు ముందు తన కుటుంబం పేరు మీదనే డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటిని కావాలంటే చూపిస్తాను అన్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడు దువ్వాడ మూడు చెక్కులు ఇచ్చాడని, ఆ చెక్కులు తన వద్దనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆ చెక్కులు తాను క్యాష్ చేసుకోలేకపోయానంటూ రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం తెలిపారు.
ఇంటి స్థలం డబ్బులు ఇచ్చి పోటీ పడమన్న రిటైర్డ్ టీచర్
తనకు 60 లక్షల రూపాయల బకాయి రావాల్సి ఉందని తన డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంటి కోసం కొట్టుకోమని ఆయన పేర్కొన్నారు ఇంటిస్థలం నాదైతే దువ్వాడ కుటుంబం పోటీ పడడం ఏమిటి అంటూ పార్వతీశం ప్రశ్నిస్తున్నారు. గౌరవంగా ఉండాల్సిన కుటుంబం ఇలా రోడ్డున పడి జనాలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన స్థలాన్ని దువ్వాడ శ్రీనివాస్ కు అమ్మినందుకు బాధపడుతున్నానని రిటైర్డ్ టీచర్ చెప్పారు.
ఇంతకాలం డబ్బులు తీసుకోకుండా ఎలా ఉన్నారు?
ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తుందని పేర్కొన్న ఆయన బంధాలు లేకుండా ఆస్తులు ఏం చేసుకుంటారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ గొడవలకు ఫుల్స్టాప్ పెట్టి తన డబ్బు తనకిచ్చి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. అయితే ఇళ్ల స్థలం అమ్మిన తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోతే ఇంతకాలం రిటైర్డ్ టీచర్ ఏం చేస్తున్నాడు అని తాజాగా ఆయన వ్యాఖ్యలు విన్నవారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో రోజుకో కొత్త క్యారెక్టర్ వచ్చి చేరడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications