ఆ ఖలేజా నాకుంది.. అందుకే చేశా, మర్యాదపూర్వకమే.. తప్పేముంది: జేసీ దివాకర్ రెడ్డి
రాజకీయాల్లో రాజీనామా చేయాలంటే ఖలేజా ఉండాలని, ఆ ఖలేజా తనకు ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందరూ రాజీనామా చేస్తామని బెదిరిస్తే చెల్లదని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతపురం: రాజకీయాల్లో రాజీనామా చేయాలంటే ఖలేజా ఉండాలని, ఆ ఖలేజా తనకు ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందరూ రాజీనామా చేస్తామని బెదిరిస్తే చెల్లదని ఆయన వ్యాఖ్యానించారు.
సమస్య వచ్చినప్పుడు గట్టిగా నిలబడే శక్తి తనకుందని, అందుకే రాజీనామా చేస్తానని చెప్పినట్లు జేసీ వెల్లడించారు. అనంతపురంలో రోడ్ల విస్తరణను ఎవరూ అడ్డుకోలేరని జేసీ అన్నారు. రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయినవారికి తప్పకుండా నష్టపరిహారం ఇస్తామన్నారు.

సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబుకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పయ్యావుల కేశవ్ సమావేశం మర్యాదపూర్వకమేనని జేసీ పేర్కొన్నారు. క్షేమ సమాచారాలు తెలుసుకోవడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications