రాజధాని: భూమి బలంపై నివేదిక కోరిన సింగపూర్ ప్రభుత్వం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమిలో బలం పైన సింగపూర్ ప్రభుత్వం నివేదికలు కోరింది. వాటి ఆధారంగా నిర్మాణాలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన వివరాలను సీఆర్డీఏ పది రోజుల్లో సింగపూర్ ప్రభుత్వానికి అందించనుంది.
కొన్ని రకాల భూముల్లో ఆకాశహర్మ్యాలు సాధ్యం కాదు. ఆయా ప్రాంతాల్లో భరించగలిగిన సామర్థ్యం ఆధారంగా నిర్మాణాలు చేపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతంలోని భూ స్వరూప పరీక్షల నివేదికలను అందించాలని రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో నిమగ్నమైన సింగపూర్ ప్రభుత్వం సీఆర్‌డీఏను కోరింది.

సామర్థ్యం అధికంగా ఉన్న ప్రదేశాల్లో బహుళ అంతస్థుల భవనాలు, తక్కువ సామర్థ్యం ఉన్న పొలాల్లో తక్కువ అంతస్థులుండే నిర్మాణాలు, మరీ తక్కువ కెపాసిటీ కలిగిన ప్రాంతాల్లో ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు, రిక్రియేషన్ జోన్లు, బోటింగ్ సౌకర్యాలు వంటివి అయితే బాగుంటుందని భావిస్తున్నారట. అంతేకాకుండా, ఒక ప్రాంతంలో అన్నింటిని అదే ఎత్తున నిర్మించకూడదని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications