ముఖ్యమంత్రికే మంట పుట్టించింది..

మీటూ ఉద్యమంలో భాగంగా సింగర్ చిన్మయి తమిళ పాటల రచయిత వైరముత్తు మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమిళ సినీ పరిశ్రమ నుంచి చిన్మయి నిషేధాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా వైరముత్తు ఇంటికి వెళ్లి అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంఘటలనపై చిన్మయి మండి పడింది.

మీటూ ఉద్యమంలో వైరముత్తుమీద ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి తనపై నిషేధం విధించారని, గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డులు గెలుచుకున్న తనమీదే బ్యాన్ వేశారని, ఐదు సంవత్సరాలుగా నరకం కనపడుతోందన్నారు. న్యాయస్థానంలో కేసు వేశానని తనను న్యాయం అడుగుతావా? అంటూ కక్ష కట్టారన్నారు.

singerchinmayi

ఒక వేధించేవాడు, కవి చాలా దశాబ్దాల క్రితం జన్మించాడని, ఏ మహిళపైనైనా అతను చేయి వేయగలనని ఫిక్స్ అయ్యాడు.. నోరు తెరవకుండా ఉండేందుకు డీఎంకేతో, రాజకీయ నాయకులతో అతనికి ఉన్న బంధం కలిసి వచ్చింది. అలాంటి వాడికి పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, పలు జాతీయ అవార్డులను ఇచ్చారని, ఆ మనిషికి ఉన్న అధికారం అలాంటిదన్నారు. అతని వేధింపుల గురించి అందుకే చెప్పలేకపోయామన్నారు.

మహిళల భద్రత గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే సిగ్గుగా అనిపిస్తోందని, వైరముత్తు గురించి చెబితే వారంతా మౌనంగా ఉన్నారన్నారు. గొప్ప సంస్కృతి ఉన్న తమిళ గడ్డ మీద ఇలాంటి వేధింపులు చేసే వారి పుట్టిన రోజులు ఘనంగా సెలెబ్రేట్ చేస్తున్నారని, సున్నితత్వం, సానుభూతి, విద్య వంటి వాటిపై ఇక్కడి వారికి అవగాహన శూన్యమని మండిపడ్డారు.

బ్రిజ్ భూషణ్ నుండి వైరముత్తు వరకు ఇలా అందరినీ రాజకీయ నాయకులు కాపాడతారని, ఈ భూమి మీద న్యాయం లేనప్పుడు ఇతర వాటి గురించి బాధపడటం కూడా అనవసరమని చిన్మయి ట్వీట్ లో తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+