మన భారతదేశంలో చివరి రైల్వేస్టేషన్ ఏదో తెలుసా?
భారతీయ రైల్వే రోజురోజుకు అద్భుత పురోగతి సాధిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్కీం కింద విమానాశ్రయాల తరహాలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది చివరలోకానీ, తర్వాత ఏడాదికానీ పట్టాలెక్కబోతోంది. సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ పట్టాలపై వేగంగా పరుగులు తీస్తున్నాయి.
బ్రిటీష్ కాలంలో నిర్మించారు
అనేక ఘనతలను సొంతం చేసుకున్న భారతీయ రైల్వే నెట్ వర్క్ లక్ష కిలోమీటర్లుగా ఉంది. ప్రతిరోజు 13వేల రైళ్లు కోటిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. భారత్ లోని ప్రతి రైల్వేస్టేషన్ కు ఒక కథ ఉంటుంది. వాటివెనకాల ఎన్నో వాస్తవిక జీవితాలకు సంబంధించిన చరిత్ర ఉంటుంది. ఈ కోవలోకి చెందినదే మన దేశంలోని చివరి రైల్వేస్టేషన్ సింగాబాద్ స్టేషన్. పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని మాల్దా జిల్లా హబీబ్ పూర్ ప్రాంతంలో ఇది ఉంది. దీన్ని ఇండియా చివరి స్టేషన్ గా భావిస్తారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. దీన్ని బ్రిటీష్ కాలంలో నిర్మించారు.

రాకపోకలు సాగిస్తున్న గూడ్స్ రైళ్లు
భారతదేశానికి, బంగ్లాదేశ్ కు మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొల్పడంలో ఈ స్టేషన్ ది కీలక పాత్ర. జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటివారు ఢాకా వెళ్లాలంటే ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించేవారు. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు సాగడంలేదు. ప్రయాణికుల కోసం రైలు ఆగడంలేదుకానీ గూడ్స్ రైళ్లను మాత్రం ఆపుతున్నారు.
సింగాబాద్ నుంచి బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాలకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎగుమతులు, దిగుమతుల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రయాణికుల రైళ్లకు సంబంధించిన సిబ్బంది ఎవరూ ఇక్కడ విధులు నిర్వహించనప్పటికీ గూడ్స్ రైళ్లకు సంబంధించిన ఉద్యోగస్తులు మాత్రం ఉంటారు. సిగ్నల్ ఇంజనీర్ తోపాటు స్టేషన్ సిబ్బంది పలువురు ఉంటారు. అయితే సింగాబాద్ లో ప్రయాణికుల కోసం రైళ్లను నిలపాలంటూ కొన్నాళ్లుగా ఇక్కడి ప్రజలు రైల్వేను కోరుతున్నారు.
-
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
IRCTC స్పెషల్ ఆఫర్ - అరకు, విశాఖ టూర్ స్పెషల్.. ప్యాకేజీ ఇలా..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications