జగన్.. గ్రీన్ సిగ్నల్

అమరావతి: రాష్ట్రంలో మరిన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. కడప, తిరుపతి, విశాఖపట్నం, నంద్యాల.. సహా పలు జిల్లాల్లో ఆయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పలు భారీ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కడప జిల్లా వేంపల్లె మండలంలో 1,500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదించింది. జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నెలకొల్పనుంది. డిసెంబర్‌ 2024లో నిర్మాణ పనులు మొదలవుతాయి. ఏడాదికి 3,314.93 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

SIPB headed by CM YS Jagan clears investment proposals in Andhra Pradesh

ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారు 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ అనుబంధ సంస్థ క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 225 మెగావాట్ల సామర్థ్యం గల సౌర, 150 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందీ సంస్థ. 2,450 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ సంస్థ నిర్మాణ పనులు మొదలవుతాయి.

నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల, కడప జిల్లాలో మరిన్ని ప్రాజెక్టులను ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా అన్నవరంలో హెోటళ్లు, రిసార్టులను నిర్మించడానికి మే ఫెయిర్‌ సంస్థ ముందుకొచ్చింది. 525 కోట్ల రూపాయల పెట్టుబడితో వాటిని నిర్మిస్తుంది. దీనివల్ల సుమారు 750 మందికి ప్రత్యక్షంగా, వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

నాలుగేళ్లలో హోటళ్లు, రిసార్టులను నిర్మించాలని మే ఫెయిర్ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కన్వెన్షన్‌ సెంటర్, 250 హోటల్‌ గదులు,మినీ గోల్ఫ్‌ కోర్టు తదితర సదుపాయాలు ఉంటాయి. షాపింగ్‌ మాల్‌ సహా విల్లాలను నిర్మిస్తుందీ మే ఫెయిర్ సంస్థ. తిరుపతి జిల్లా పేరూరు వద్ద 218 కోట్ల రూపాయలతో హయత్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ ఏర్పాటు కానుంది.

దీనివల్ల 260 మందికి ప్రత్యక్షంగా, 1,296 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. మూడున్నర సంవత్సరాల్లో దీని నిర్మాణం పూర్తవుతుంది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద హిందుస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు కానుంది. దీని పెట్టుబడి వ్యయం అంచనా 1,200 కోట్ల రూపాయలు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,800 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

SIPB headed by CM YS Jagan clears investment proposals in Andhra Pradesh

తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్‌ పుడ్‌, బెవరేజెస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు కానుంది. దీని నిర్మాణ వ్యయం 400 కోట్ల రూపాయలు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాఫీని సాగుచేస్తున్న 2,500 మందికి ఈ ప్లాంట్ లబ్ది కలిగిస్తుంది. దీని ఉత్పత్తి లక్ష్యం- ఏడాదికి 16,000 టన్నుల.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో గోకుల్‌ ఆగ్రో రిసోర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ కొత్తగా ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పుతుంది. దీనికోసం 230 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. రోజుకు 1,400 టన్నులు వంటనూనె తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ. దీనివల్ల ప్రత్యక్షంగా 350 మందికి, పరోక్షంగా 850 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 2,500 మంది రైతులకూ ఇది ఉపయోగకరం.

తిరుపతి జిల్లా శ్రీసిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. ఏడాదికి 40,000 టన్నులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ. దీనికోసం 168 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 800 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 3,000 మంది రైతులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+